విద్యుత్ ధరలు, ఇంధన సమస్యలు... ఏపీని ఆదుకోండి: ప్రధాని మోడీకి జగన్ లేఖ

Siva Kodati |  
Published : Oct 08, 2021, 08:40 PM IST
విద్యుత్ ధరలు, ఇంధన సమస్యలు... ఏపీని ఆదుకోండి: ప్రధాని మోడీకి జగన్ లేఖ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీకి (PM Narendra Modi) ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy) శుక్రవారం లేఖ రాశారు. విద్యుత్‌ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 

ప్రధాని నరేంద్ర మోడీకి (PM Narendra Modi) ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy) శుక్రవారం లేఖ రాశారు. విద్యుత్‌ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ తర్వాత గత ఆరు నెలల్లో విద్యుత్‌ డిమాండ్‌ (power demand) 15 శాతం పెరిగిందని జగన్ గుర్తుచేశారు. గడిచిన నెలలోనే విద్యుత్‌ డిమాండ్‌ 20 శాతానికిపైగా పెరిగిందని.. విద్యుత్‌ కొనుగోలు చేయాలంటే కొన్ని సందర్భాల్లో యూనిట్‌కు రూ.20 చెల్లించాల్సి వస్తుందని జగన్ లేఖలో పేర్కొన్నారు.

Also Read:ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్... రిపబ్లిక్ డే నాటికి సిద్దంకండి: సీఎం జగన్ కీలక ఆదేశాలు

రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్‌ కొనుగోలు చేయాలన్నా అందుబాటులో ఉండటం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ థర్మల్‌ ప్రాజెక్టులకు 20 ర్యాక్‌ల బొగ్గు (coal) కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. కొంతకాలంగా పనిచేయని బొగ్గు ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని.. ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ద్వారా ఏపీకి అత్యవసర ప్రాతిపదికన గ్యాస్‌ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కోరారు. విద్యుత్‌ డిస్కంలకు బ్యాంకుల ద్వారా సులభతరమైన రుణాలివ్వాలని సీఎం తెలిపారు. కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలను (central power generation company ) పునరుద్ధరించి మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌.. మోడీని లేఖలో కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్