ఏపీలో కొత్తగా 693 మందికి కరోనా పాజిటివ్,.. తూ.గోలో స్వల్పంగా పెరిగిన కేసులు

Siva Kodati |  
Published : Oct 08, 2021, 06:03 PM IST
ఏపీలో కొత్తగా 693 మందికి కరోనా పాజిటివ్,.. తూ.గోలో స్వల్పంగా పెరిగిన కేసులు

సారాంశం

ఏపీలో కొత్తగా 693 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. 6 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 927 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 8,310 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు (corona cases in ap) మరోసారి 1000లోపే నమోదయ్యయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 693 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,53,104కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,242కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల గుంటూరు 1, కృష్ణ 2,  చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరిలలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 927 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,30,552కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 48,235 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,86,60,811కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 8,310 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 9, చిత్తూరు 93, తూర్పుగోదావరి 178, గుంటూరు 91, కడప 15, కృష్ణ 76, కర్నూలు 6, నెల్లూరు 72, ప్రకాశం 59, శ్రీకాకుళం 11, విశాఖపట్నం 43, విజయనగరం 6, పశ్చిమ గోదావరిలలో 34 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
పోలీసులపై రాజకీయ కక్షలా? వైసీపీకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన హోంమంత్రి అనిత | Asianet News Telugu