రాజకీయం కోసమే ఉండొచ్చు: అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపై ఉండవల్లి

By narsimha lode  |  First Published Aug 22, 2022, 7:16 PM IST

కేంద్ర మంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై మాజీ ఎంపీ  ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.  ఈ భేటీ రాజకీయం కోసమే కావొచ్చన్నారు.


రాజమండ్రి: కేంద్ర మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ రాజకీయం కోసమే కావొచ్చని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.సోమవారం నాడు ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ ఉపయోగించుకొనే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ కు అన్ని విషయాలపై అవగాహన ఉందని చెప్పారు. 
 శ్రీకాకుళం జిల్లాలో  నారా లోకేష్ ను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు తనకు పరస్పర అభిమానం ఉందని ఆయన చెప్పారు. బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారన్నారు.  బీజేపీతో ఎవరు వెళ్లినా తాను మాత్రం సమర్ధించనని ఉండవల్లి అరుణ్ కుమార్  చెప్పారు.

2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ఉమ్మడి ఏపీ  రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నుండి ప్రచారం ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ఖమ్మం జిల్లా నుండి ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని హైద్రాబాద్ కు తిరిగి వస్తున్న సమయంలో సూర్యాపేటకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు.  ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. టీడీపీ నాయకత్వానికి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ కూడా దీనికి కారణమనే ప్రచారం కూడా రాజకీయవర్గాల్లో సాగుతుంది.  అయితే  ఈ తరుణంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం రాజకీయంగా చర్చకు  దారి తీసింది. 

Latest Videos

undefined

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ  ప్లాన్ చేస్తుంది.ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా పార్టీల్లోని కీలక నేలనే తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తుంది. మరో వైపు ప్రముఖులను, సీనీ నటులను కూడా తమ పార్టీలోకి రావాలని కూడా  ఆహ్వానాలు పంపుతుంది.  

also read:ఆ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు: జూ. ఎన్టీఆర్, అమిత్ షా మీటింగ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి నిన్ననే బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఇంకా పెద్ద సంఖ్యలో బీజేపీలలో చేరికలు ఉండే అవకాశం ఉందని కమలదళం నేతలు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీని భవిష్యత్తులో రాజకీయ మార్పులకు సంకేతంగా బీజేపీ ఏపీ రాష్ట్రానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 


 

 


 

click me!