అమిత్ షాతో జగన్ భేటీ: మండలి రద్దు, మూడు రాజధానులపై చర్చ

Siva Kodati |  
Published : Feb 14, 2020, 09:59 PM IST
అమిత్ షాతో జగన్ భేటీ: మండలి రద్దు, మూడు రాజధానులపై చర్చ

సారాంశం

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న సీఎం నేరుగా వెళ్లి అమిత్ షాను కలిశారు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న సీఎం నేరుగా వెళ్లి అమిత్ షాను కలిశారు.

వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హైకోర్టు తరలింపు, మండలి రద్దుపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read:మోడీతో జగన్ భేటీ: మండలి రద్దు, హైకోర్టు తరలింపుపై తేల్చాలని విన్నపం

బుధవారం ఢిల్లీకి వెళ్లిన జగన్.. ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉగాది నాడు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానమంత్రిని ఆహ్వానించారు.

దీనితో పాటు విభజన సమస్యలు, హైకోర్టు తరలింపు, మూడు రాజధానులు, మండలి రద్దు తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి.. మోడీకి వివరించారు. అయితే గురువారం ఢిల్లీలోనే ఉండి హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు సీఎం రెడీ అయ్యారు. 

Also Read:మోడీతో జగన్ భేటీ: మండలి రద్దు, హైకోర్టు తరలింపుపై తేల్చాలని విన్నపం

ఆయన అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో జగన్ తిరిగి విజయవాడకు వచ్చేశారు. దీనికి తోడు గురువారం రాష్ట్రంలో బిజీ షెడ్యూల్ ఉండటం కూడా ఒక కారణం.

మండలి రద్దుతో పాటు హైకోర్టు తరలింపు, విభజన అంశాలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండటంతో అమిత్ షాను ఎట్టి పరిస్ధితుల్లోనూ కలవాలని జగన్ భావించారు. దీని కారణంగానే శుక్రవారం మరోసారి ఢిల్లీకి వచ్చారు. ఈ రాత్రికి సీఎం ఢిల్లీలోనే బస చేసి.. శనివారం పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!