ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీలు అమలు చేస్తే ఊరట: మోడీతో జగన్ భేటీ

Published : Jan 03, 2022, 07:13 PM ISTUpdated : Jan 03, 2022, 07:54 PM IST
ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీలు అమలు చేస్తే ఊరట: మోడీతో జగన్ భేటీ

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్  సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన పలు సమస్యలపై మోడీతో సీఎం జగన్ చర్చించారు. తెలంగాణ నుండి రావాల్సిన బకాయిలను రాష్ట్రానికి అందించేలా చూడాలని కూడా కోరారు.

న్యూఢిల్లీ:ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేస్తే  తమ రాష్ట్రానికి చాలా వరకు ఊరట లభిస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని Narnedra Modiకి చెప్పారుఏపీ సీఎం Ys Jagan  ప్రధాని నరేంద్ర మోడీతో  సోమవారం నాడు భేటీ అయ్యారు. సుమారు గంటలకు పైగా ఈ బేటీ కొనసాగింది. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్.

రాష్ట్ర విభజన పర్యవసానాలు, ఆర్ధిక ప్రగతిని తీవ్రంగా దెబ్బతీశాయని సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చారు.రాష్ట్ర విభజన సమయంంలో 58 శాతం జనాభా  Andhra pradesh కి వచ్చిందన్నారు.  45 శాతం రెవిన్యూ మాత్రమే ఏపీకి దక్కిందని ఆయన గుర్తు చేశారు.

భౌగోళికంగాTelangana కంటే ఏపీ పెద్దదనే విషయాన్ని సీఎం జగన్ ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. విభజనతో ఏపీ రాజధానిని కూడా కోల్పోయిందని సీఎం మోడీకి చెప్పారు. Special Status తో పాటు అనేక హమీలను నెరవేర్చలేదన్నారు. వీటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు.

2017-18 ధరల ప్రకారంగా పోలవరం  అంచనా వ్యయాన్ని రూ. 55, 657 కోట్లుగా నిర్ణయించాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ బిల్లులు రూ. 2100 కోట్లు  మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని కోరారు.తెలంగాణ విద్యుత్ సంస్థల నుండి ఏపీ రావాల్సిన 6,284 కోట్లను చెల్లించేలా చూడాలని కూడా ఆయన ప్రధానికి విన్న వించారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను అంగీకరించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను జగన్ కోరారు.ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం తర్వాత ఆర్ధిక మంత్రి Nirmala sitharamanతో  సీఎం వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు.రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్‌ సమస్యలను జగన్ నివేదించారు.ఈమేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించారు.ప్రత్యేక హోదా, సవరించిన Polavaram  అంచనాలకు ఆమోదం. రెవిన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు, రుణపరిమితి, రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం తదితర అంశాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో  సీఎం. జగన్ చర్చించారు.
 

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!