వాస్తవాలు తెలుసుకోండి.. మీరు రోడ్డెక్కడం బాధించింది: వాలంటీర్లకు జగన్ లేఖ

By Siva KodatiFirst Published Feb 9, 2021, 10:28 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ లేఖ రాశారు. జీతాలు పెంచాలనే డిమాండ్ నా దృష్టికి వచ్చిందన్నారు. వాస్తవాలతో సంబంధం లేకుండా రోడ్డెక్కారన్న వార్త బాధించిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ లేఖ రాశారు. జీతాలు పెంచాలనే డిమాండ్ నా దృష్టికి వచ్చిందన్నారు. వాస్తవాలతో సంబంధం లేకుండా రోడ్డెక్కారన్న వార్త బాధించిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవలు అందించడమని జగన్ స్పష్టం చేశారు. వాలంటీర్లకు ఇచ్చేది జీతం కాదు.. గౌరవ భృతి అన్నారు. ఇదే విషయాన్ని హ్యాండ్ బుక్‌లో స్పష్టంగా చెప్పామని.. వారంలో మూడ్రోజులు హాజరు అవుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నారని కాబట్టే.. ప్రజలు గౌరవిస్తున్నారని జగన్ స్పష్టం చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేయాలని కొందరు కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. వాలంటీర్లు ప్రలోభాలకు దూరంగా వుండాలని ఆయన సూచించారు.

గౌరవ వేతనాన్ని రూ.12 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండు చేస్తూ గ్రామ, వార్డు వాలంటీర్లు సోమవారం రాష్ట్రంలోని పలు చోట్ల ధర్నాకు దిగారు.

దీనిలో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద వేల మంది చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు రంగంలోకి దిగి కొంతమందిని అదుపులోకి తీసుకోవడంతో వాలంటీర్లు ఆగ్రహించి రహదారులపై బైఠాయించారు.

రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాలు, పురపాలక సంఘాల్లోనూ అధిక సంఖ్యలో వాలంటీర్లు నిరసనల్లో పాల్గొని అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. జాబ్‌ఛార్టు ఏర్పాటు చేయాలని, ఉద్యోగ వేళలు నిర్ణయించాలని, అధికారుల వేధింపుల నుంచి కాపాడాలని డిమాండు చేశారు

click me!