ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సాలూరులో కేంద్రీయ గిరిజన యూనివర్శిటీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు.
విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సాలూరులో కేంద్రీయ గిరిజన యూనివర్శిటీకి ఏపీ సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారంనాడు శంకుస్థాపన చేశారు. రూ. 834 కోట్లతో 561.88 ఎకరాల్లో ఈ యూనివర్శిటీని నిర్మించనున్నారు.
ఈ యూనివర్శిటీ కోసం మెంటాడ మండలం చినమేడపల్లి, దత్తిరాజేరు మండలం మర్రివలస గ్రామాల్లో భూ సేకరణను కూడ పూర్తి చేశారు. గిరిజన ప్రాంతంలో గిరిజన యూనివర్శిటీ నిర్మాణం కోసం ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన విషయం తెలిసిందే. సాలూరులో గిరిజన యూనివర్శిటీకి సంబంధించి మౌళక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 23.60 కోట్లను గత ఏడాది విడుదల చేసింది. విశాఖపట్టణం-రాయ్‌పూర్ జాతీయ రోడ్డు నుండి సీటీయూఏపీ ప్రాంగణం వరకు రూ. 16 కోట్లతో రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. తాగు నీటి కోసం రూ. 7 కోట్లు కేటాయించింది సర్కార్.
undefined
విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నమూనాను పరిశీలించిన సీఎం వైయస్ జగన్, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. pic.twitter.com/ZvruipFjK6
— YSR Congress Party (@YSRCParty)మరో వైపు భూసేకరణ కోసం రూ. 29.97 కోట్లను పరిహారం కింద ఇప్పటికే చెల్లింపులను పూర్తి చేసింది సర్కార్. గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు యూనివర్శిటీ దోహాదపడుతుంది. స్కిల్ డెవలప్ మెంట్ , ఒకేషనల్, జాబ్ ఓరియేంటెడ్, షార్ట్ టర్మ్ కోర్సులను అందించనున్నారు.అంతేకాదు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను వర్శిటీ ప్రోత్సహించనుంది. 2019 నుండి విజయనగరం జిల్లా కొండకారకంలోని ఆంధ్రా యూనివర్శిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో క్లాసులు నిర్వహిస్తున్నారు.