విధ్యార్ధినుల కోసం 'స్వేచ్ఛ': ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

Published : Oct 05, 2021, 12:32 PM IST
విధ్యార్ధినుల కోసం 'స్వేచ్ఛ': ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

సారాంశం

స్వేచ్ఛ కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు ప్రారంభించారు. 7 నుండి 12వ తరగతి విద్యార్ధినులకు నెలకు 10 శానిటరీ న్యాప్‌కిన్స్  ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. విద్యార్ధినులు స్కూళ్లు మానివేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వేచ్ఛ(swetcha ) కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ (ap cm ys jagan) మంగళవారం నాడు ప్రారంభించారు.ఏపీలో స్వేచ్ఛ కార్యక్రమంలో  భాగంగా విద్యార్ధినులకు నెలకు 10 శానిటరీ నాప్‌కిన్స్ (sanitary napkin)ను ప్రభుత్వం అందిస్తోంది. బాలికలు(girl) మహిళల(woman) ఆరోగ్యం, పరిశుభ్రతే  లక్ష్యంగా స్వేచ్ఛ  కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్లు పంపిణీ చేస్తున్నారు.

also read:డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉండొద్దు: పోలీసులకు ఏపీ సీఎం జగన్ ఆదేశం

ఏపీ రాష్ట్రంలో 7  నుండి 12 వ తరగతి విద్యార్ధినులకు ఉచితంగా న్యాప్‌కిన్లు అందివ్వాలనే ఉద్దేశ్యంతో జగన్ సర్కార్ ఈ కార్యక్రమాన్ని సోమవారం నాడు ప్రారంభించింది.23 శాతం విద్యార్ధినులు స్కూల్ మానేయడానికి కారణం శానిటేషన్ సమస్యే కారణంగా సీఎం జగన్ గుర్తు చేశారు.రుతుక్రమం సమస్యలతో చదువులు మద్యలోనే ఆగిపోతున్నాయని ఆయన చెప్పారు.

యునిసెఫ్, వాష్, మరో సంస్థతో కలిసి సమన్వయంతో అవగాహన తరగతులు నిర్వహిస్తామని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలోని 10,388 స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్లు పంపిణీ చేయనున్నట్టుగా జగన్ తెలిపారు.

ప్రతి నెల జాయింట్ కలెక్టర్లు, ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరగాలని సీఎం కోరారు. మహిళా టీచర్లు, ఎఎన్ఎంలు విద్యార్ధినులకు అవగాహన కల్పించాలని సీఎం కోరారు. నాణ్యమైన న్యాప్‌కిన్ల కోసం రూ. 32 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు.ప్రతి స్కూల్ లో మహిళా నోడల్ అధికారి నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు. చేయూత స్టోర్‌లో అతి తక్కువ ధరకే  న్యాప్‌కిన్ ను అందిస్తామని సీఎం చెప్పారు.


 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu