విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం... మంత్రి వెల్లంపల్లి పీఏకు తీవ్ర గాయాలు, కుటుంబసభ్యులతో సహా

Arun Kumar P   | Asianet News
Published : Oct 05, 2021, 12:07 PM ISTUpdated : Oct 05, 2021, 12:12 PM IST
విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం... మంత్రి వెల్లంపల్లి పీఏకు తీవ్ర గాయాలు, కుటుంబసభ్యులతో సహా

సారాంశం

విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెెల్లంపల్లి శ్రీనివాస్ పీఏతో సహా కుటుంబం మొత్తం గాయపడింది. 

విశాఖ (Visakhapatnam) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident)చోటుచేసుకుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Minister Vellampalli Srinivas) వ్యక్తిగత సహాకుడు(పీఏ) కారులో కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయినట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా తగరపు వలస వద్ద మంత్రి పీఏతో పాటు కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. 

ప్రమాదం జరిగిన వెంటనే తీవ్రంగా గాయపడిన వారిని విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే పీఏతో పాటు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా పరామర్శించి మంత్రి వెల్లంపల్లి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అప్పటికే క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించడంతో ధ్వంసమైన వాహనాన్ని పరిశీలించారు.  ప్రమాదానికి గల కారణాలు తెలుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్