శరవేగంగా పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు (వీడియో)

By AN TeluguFirst Published Oct 5, 2021, 12:25 PM IST
Highlights

జలవిద్యుత్ కేంద్రంలో మొత్తం  12 ప్రెజర్ టన్నెల్స్ , ఒక్కో టన్నెల్ పొడవు 150.3మీ.లు కాగా, వెడల్పు 9మీటర్లు. మేఘా ఇంజనీరింగ్ సంస్ద అతి తక్కువ కాలంలోనే రెండవ  టన్నెల్ తవ్వకం పూర్తి చేసింది. 

భారీ వరదలు పోటెత్తుతున్నా (Flash Floods)పోలవరం  జల విద్యుత్ కేంద్రం పనులు (Polavaram Hydroelectric Power Station) శరవేగంగా సాగుతున్నాయి.  ఇటీవలే ప్రారంభమైన పోలవరం జలవిద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు జరుగుతున్నాయి.

"

జలవిద్యుత్ కేంద్రంలో మొత్తం  12 ప్రెజర్ టన్నెల్స్ , ఒక్కో టన్నెల్ పొడవు 150.3మీ.లు కాగా, వెడల్పు 9మీటర్లు. మేఘా ఇంజనీరింగ్ సంస్ద అతి తక్కువ కాలంలోనే రెండవ  టన్నెల్ తవ్వకం పూర్తి చేసింది. 

మిగతా టన్నెల్స్ తవ్వకం పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే 2139639 క్యూబిక్ మీటర్ల కొండతవ్వకం పనులు పూర్తి చేసిన మేఘా సంస్థ. పోలవరం జలవిద్యుత్ కేంద్రం కొండ తవ్వకం పనులు దాదాపు పూర్తి.

జలవిద్యుత్ కేంద్రంలో 12వెర్టికల్ కల్పన్ టర్బైన్ లుండగా.. ఒక్కో టర్బైన్ కెపాసిటీ  80 మెగా వాట్లుగా ఉంది.  

అదేవిధంగా 12 ప్రెజర్ టన్నెల్ లు ఉన్నాయి. వీటికి 12జనరేటర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ 100మెగా వాట్ల కెపాసిటీ తో ఉంటుంది.

టన్నెల్ తవ్వకం పనులను దగ్గరుండి పర్యవేక్షించిన జెన్కో ఎస్ఈఎస్ శేషారెడ్డి, ఈఈలు ఏ.సోమయ్య, సి.హనుమ, మేఘా ఇంజనీరింగ్ సంస్ద వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జిఎం ముద్దుకృష్ణ, ఎజిఎం క్రాంతికుమార్, రాజేష్ కుమార్,మేనేజర్ మురళి తదితరులు.

click me!