అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగుల వసతి రద్దు.. వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్, జగన్ కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Jun 29, 2022, 8:57 PM IST
Highlights

అమరావతిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల ఉచిత వసతిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఉచిత వసతిని మరో రెండు నెలల పాటు కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో (amaravathi) ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తిని (free accomodation) ర‌ద్దు చేస్తూ ఇవాళ మధ్యాహ్నం తీసుకున్న నిర్ణ‌యంపై రాష్ట్ర ప్రభుత్వం (ap govt) వెనక్కి తగ్గింది. ఈ మేరకు మరో రెండు మాసాల పాటు ఉద్యోగులకు ఉచిత వసతి కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) బుధవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

కాగా.. అమ‌రావ‌తిలో ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తిని ర‌ద్దు చేస్తూ ఈరోజు జీఏడీ ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. గురువారంలోగా ఉద్యోగులు తమకు కేటాయించిన ఫ్లాట్ల‌ను ఖాళీ చేయాల‌ని ఆదేశించింది. ఈ వ్య‌వ‌హారంపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో విషయం సీఎం జగన్ దాకా వెళ్లింది. దీనిపై స‌మాచారం అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి.. ఉద్యోగులకు ప్రస్తుతం వున్న ఉచిత వ‌స‌తిని మ‌రో రెండు నెల‌ల పాటు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

ALso REad:ఏపీ ప్రభుత్వోద్యోగుల ఖాతాల్లోంచి డబ్బులు మాయం... ఆర్థిక శాఖ అధికారులు ఏమంటున్నారంటే..

తాజాగా అనుమ‌తించిన ఉచిత వ‌స‌తిని ఉద్యోగులు షేరింగ్ ప్రాతిప‌దిక‌న ఉపయోగించుకోవాలని ప్ర‌భుత్వం సూచించింది. ప్రభుత్వ నిర్ణయంతో స‌చివాల‌యం, రాజ్ భ‌వ‌న్‌, హైకోర్టు, అసెంబ్లీ, శాఖాధిప‌తుల కార్యాల‌యాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగుల‌కు ఊరట ల‌భించ‌నుంది.

మరోవైపు.. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాల నుండి డబ్బులు మాయమైన వ్యవహారం వివాదాస్పదమవుతోంది. వివిధ జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతానుండి డబ్బులు విత్ డ్రా అయినట్లు వారి మొబైల్స్ కు మెసేజ్ లు వచ్చాయి. ఇలా ఉద్యోగుల ఖాతాలో జమచేసిన దాదాపు రూ.800 కోట్లు విత్ డ్రా అయినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్ధికశాఖ స్పెషల్ సిఎస్ రావత్, సత్యనారాయణల ను ఏపి ఉద్యోగసంఘాల జేఎసి, అమరావతి ఉద్యోగ సంఘాలు ఏపీ ఆర్ధికశాఖ స్పెషల్ సిఎస్ రావత్, సత్యనారాయణల ను కలిసి సమస్యను వివరించారు. 
 

click me!