పార్టీ పరిస్థితిపై సీఎం జగన్ ఫోకస్.. ఫిబ్రవరి 2న రీజనల్ కో ఆర్డినేటర్‌లతో కీలక సమావేశం

By Sumanth KanukulaFirst Published Jan 30, 2023, 4:39 PM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ పరిస్థితిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2వ తేదీన సీఎం జగన్.. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ పరిస్థితిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2వ తేదీన సీఎం జగన్.. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల ఎంపిక ప్రక్రియను సీఎం జగన్ సమీక్షించనున్నారు. ఇక, ఫిబ్రవరి మొదటివారంలో మండలస్థాయిలో సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వైసీపీ వర్గాలు తెలిపాయి. 

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారం నిలపుకునే విధంగా సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పకొట్టడంతో పాటు.. ప్రభుత్వ పథకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, అన్ని నియోజకవర్గాల పరిశీలకులతో సమావేశం సందర్భంగా వైఎస్ జగన్.. పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. 

రాష్ట్రంలో మొత్తం 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. 50 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా గుర్తించాలని చెప్పారు. క్లస్టర్‌కి ఇద్దరు గ్రామ సారథులు వుండాలని.. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం చేపట్టాలని జగన్ సూచించారు. బూత్ కమిటీలను 10 రోజుల్లో పూర్తి చేయాలని.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు నాయకుల మానిటరింగ్ బాధ్యతలను అప్పగించాలని జగన్ సూచించారు. ఇద్దరిలో ఒక మహిళా నాయకురాలు, ఒక నాయకుడు వుండాలన్నారు. 

click me!