25 మందితో జగన్ కొత్త కేబినెట్: మంత్రివర్గంలో చోటు వీరికే

By narsimha lode  |  First Published Apr 10, 2022, 4:23 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 మందితో కొత్త టీమ్ ను సీఎం జగన్ ఎంపిక చేసుకొన్నారు. పాత వారితో పాటు కొత్తవారికి కూడా కేబినెట్ లో చోటు కల్పించారు. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో కొత్త మంత్రుల జాబితాను విడుదల చేశారు.  25 మందితో కొత్త టీమ్ నుసీఎం జగన్ ఎంపిక చేసుకొన్నారు. గత కేబినెట్ లో పనిచేసిన 10 మందిని AP Cabinet Reshuffle లో చోటు కల్పించారు. కొత్త వారిలో 15 మందికి చోటు కల్పించారు.సీనియారిటీతో పాటు పాలనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 10 మంది పాత వారికి కేబినెట్ లో చోటు కల్పించారు. దీనికి తోడు ఆయా జిల్లాల సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కూడా పాతవారికి  చోటు కల్పించారు.

గత Cabinet లో చురుకుగా వ్యవహరించిన మంత్రులను పార్టీ అవసరాల కోసం వినియోగించుకోనున్నారు. గత మంత్రివర్గం నుండి తప్పించిన 15  మందికి పార్టీ కోసం వినియోగించుకోనున్నారు.

Latest Videos

వచ్చే రెండేళ్ల తర్వాత ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు గాను అవసరమైన టీమ్ ను ఎంపిక చేసుకోవాలని YS Jagan భావించారు. పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేసేందుకు గాన మంత్రివర్గం నుండి తప్పించిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. 

కొత్త మంత్రివర్గంలో బీసీ సామాజిక వర్గం నుండి 10 మంది, కాపు సామాజిక వర్గం నుండి నలుగురు, రెడ్డి సామాజిక వర్గం నుండి నలుగురు, ఎస్సీ సామాజిక వర్గం నుండి ఐదుగురు, ఎస్టీ, మైనార్టీలకు ఒక్కరేసి చొప్పున  చోటు దక్కింది.

ఈ నెల 7వ తేదీన గత మంత్రివర్గం చివరి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో  మంత్రుల నుండి రాజీనామాలు తీసుకున్నారు. 24 మంది మంత్రులు రాజీనామా లేఖలను సీఎంకు అందించారు.  ఈ రాజీనామాలను రాజ్ భవన్ కు పంపారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  ఈ రాజీనామాలను ఆమోదించారు. కొత్త మంత్రుల జాబితాను సీఎం జగన్ రాజ్ భవన్ ను పంపారు. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కిన వారికి సీఎం జగన్ ఫోన్లు చేసి అభినందించారు.

సామాజిక సమీకరణాలు లేదా ఇతరత్రా కారణాలతో వారికి కేబినెట్ లో చోటు కల్పించలేకపోతే నామినేటేడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. 2019 లో ఏపీ సీఎం వైఎస్ జగన్  మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే సమయంలోనే రెండున్నర ఏళ్లపాటే మంత్రులుంటారని జగన్  చెప్పారు.  అయితే  మూడేళ్ల తర్వాత మంత్రివర్గాన్న పునర్వవ్యవస్థీకరించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ సీఎం కొత్త టీమ్ ఇదే

1.ధర్మాన ప్రసాదరావు,
2.సీదిరి అప్పలరాజు
3.బొత్స సత్యనారాయణ
4.గుడివాడ అమర్ నాథ్
5.సి. రాజన్నదొర
6.తాడిశెట్టి రాజా
7.చెల్లుబోయిన వేణుగోపాల్
8.బూడి ముత్యాలనాయుడు
9.నారాయణస్వామి
10.ఉషశ్రీచరణ్
11.విశ్వరూప్
12.జోగి రమేష్
13.అంబటి రాంబాబు
14.మేరుగ నాగార్జున
15.బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
16.పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి
17.కారుమూరి నాగేశ్వరరావు
18.కొట్టు సత్యనారాయణ
19.కళావతి
20.అంజద్ భాషా
21.తానేటి వనిత
22.గుమ్మనూరు జయరాం
23.తిప్పేస్వామి
24. ఆర్. కే. రోజా
25.కాకాని గోవర్ధన్ రెడ్డి

click me!