Andhra News: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మృతులో ఇద్దరు చిన్నారులు

Published : Apr 10, 2022, 04:06 PM IST
Andhra News: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మృతులో ఇద్దరు చిన్నారులు

సారాంశం

విజయనగరం జిల్లా శృంగవరపు  కోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరీపురం సమీపంలో రోడ్డుపక్కన ఆగి ఉన్న రెండు బైక్‌లను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

విజయనగరం జిల్లా శృంగవరపు  కోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరీపురం సమీపంలో రోడ్డుపక్కన ఆగి ఉన్న రెండు బైక్‌లను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వివరాలు.. సోనాపతి అనే వ్యక్తి భార్య శ్రావణి, ఇద్దరు పిల్లలు శ్రావణ్, సువాస్ కలిసి ఏవీ హోమ్స్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే ఆదివారం బైక్‌పై భార్య, పిల్లలతో కలిసి స్వగ్రామం కోనాపురం బయలుదేరాడు. 

మధ్యలో గౌరీపురం వద్ద రోడ్డు పక్కన బండిని ఆపాడు. అదే సమయంలో అరకు వైపు నుంచి వేగంగా  దూసుకొచ్చిన కారు.. రెండు బైక్‌లను ఢీకొట్టింది. అందులో సోనాపతి బైక్‌ కూడా ఉంది. ఈ ప్రమాదంలో సోనాపతి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. సోనాపతికి, అతని భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో మరో బైక్‌పై ఉన్న మరో వ్యక్తి కూడా మృతిచెందారు. ఇక, ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్