మన ప్రతిఅడుగు విప్లవాత్మకమే... ఈ కొత్త సాంప్రదాయం శ్రీకారం అందుకోసమే..: సీఎం జగన్

By Arun Kumar PFirst Published Nov 16, 2021, 5:22 PM IST
Highlights

గులాబ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం సొమ్మును విడుదల చేసారు సీఎం జగన్. 34,586 మంది రైతుల ఖాతాల్లో రూ.22 కోట్ల నష్ట పరిహారాన్ని జమచేసారు సీఎం జగన్. 

అమరావతి: 2021 గులాబ్‌ తుఫాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ(సోమవారం) పరిహారం అందించారు. క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రూ.22 కోట్ల నష్ట పరిహారాన్ని నేరుగా బాధిత రైతుల ఖాతాల్లో జమచేసారు సీఎం జగన్. 

ఈ సందర్భంగా CM YS Jagan మాట్లాడుతూ... ఈ రోజు రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసామని... ఆ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్రంలో 62 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్ధితులు ఉన్నాయని... దేశంలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితులు ఉన్నాయన్నారు. అలాంటి farner ఇబ్బందిపడితే మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. రైతులకు  ఎక్కడ నుంచి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి... వాటికి పరిష్కారం ఏమిటని గతంలో ఏ ప్రభుత్వమూ ఆలోచన చేయలేదన్నారు సీఎం. 

''మనం వేసిన ప్రతి అడుగు ఒక విప్లవాత్మకమైన చర్యగా చరిత్రలో నిలిచిపోతుంది. రైతు ఎట్టి పరిస్థితులలోనూ నష్టపోకూడదు. రైతుకు అన్ని వేళలా తోడుగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం మనది. ఆ విధంగా ప్రతి అడుగు ముందుకు వేస్తూ వచ్చాం. తుపానులు, వరదలు, కరువు ఏవి వచ్చినా సరే రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదని, ఒక వేళ వచ్చినా అదే సీజన్‌ ముగిసేలోగా వారిని ఆదుకోవాలని ఆలోచన చేస్తున్నాం'' అన్నారు. 

read more  కుప్పంలో వైసిపిదే విజయం... చంద్రబాబుది ఆడలేక మద్దెల ఓడు: మంత్రి బొత్స సంచలనం

''ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారాన్ని చెల్లించే ఒక కొత్త సాంప్రదాయాన్ని రాష్ట్రంలో తీసుకువచ్చాం. ప్రకృతి విపత్తులు వల్ల ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌ ముగిసేలోగా పారదర్శకంగా  సోషల్‌ఆడిట్‌ కోసం గ్రామంలోనే జాబితా ప్రదర్శిస్తున్నాం. పూర్తి పారదర్శకతతో వారికి పరిహారం చెల్లిస్తున్నాం. నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం'' అని జగన్ పేర్కొన్నారు.

''సెప్టెంబరులో అంటే  2 నెలల క్రితం గులాబ్‌ తుపాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ముగిసేలోగా రూ.22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమచేస్తున్నాం. రూ.22 కోట్లే కదా అని కొందరు గిట్టనివాళ్లు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి'' అన్నారు.

''ఏ రైతు అయినా నష్టపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పారదర్శకంగా గ్రామ సచివాలయంలో సోషల్‌ ఆడిట్‌ చేసి జాబితా డిస్‌ప్లే చేస్తున్నాం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. ఆ సీజన్‌ ముగిసేలోగా కచ్చితంగా ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న సాంప్రదాయనికి,  ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం'' అని జగన్ వివరించారు.

read more  గ్రామ, వార్డు మహిళా పోలీసులకు గుడ్ న్యూస్.. సీఐ వరకు పదోన్నతి పెంచనున్న జగన్ సర్కార్...

''దాదాపు రూ.1070 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాల కాలంలో పంట నష్టపరిహారం కింద ఇచ్చాం. 2020 నవంబర్‌లో నివర్‌ తుపాను వచ్చింది. నవంబరులో తుఫాను వస్తే... డిసెంబర్‌ చివరినాటికి 8.34 లక్షల మంది రైతులకు 12 లక్షల ఎకరాలలో రూ.645.99 కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద ఇచ్చాం'' అని గుర్తుచేసారు.

''ఎక్కువ, తక్కువ మొత్తం అనేది కాకుండా.. రైతుకు నష్టం జరిగినా, తుపాను వచ్చినా... ఇతరత్రా కష్టం వచ్చి రైతు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే... ఆ సీజన్‌ ముగియక ముందే  పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది'' అని సీఎం జగన్ స్పష్టం చేసారు. 


 

click me!