డాలర్ శేషాద్రి హఠాన్మరణం టిటిడికి తీరనిలోటు: సీఎం జగన్, చంద్రబాబు సంతాపం

By Arun Kumar PFirst Published Nov 29, 2021, 12:41 PM IST
Highlights

గుండెపోటుతో టిటిడి ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణంపై ఏపీ సీఎం జగన్, టిడిపి చీఫ్ చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి టిటిడికి తీరనిలోటని వీరు అభిప్రాయపడ్డారు. 

అమరావతి: కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల వెంకన్న సేవలో ఇంతకాలం తరించిన ఆలయ ఓఎస్డి  డాలర్ శేషాద్రి హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. కార్తిక దీపోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు  ఆయన విశాఖపట్నం వెళ్లారు. ఈ క్రమంలోనే సోమవారం వేకువజామున గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.  

శ్రీవారి ఆలయంలో ఎంతోకాలంగా పనిచేస్తున్నDollar sheshadri మృతిపై సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.  డాలర్‌ శేషాద్రి మృతి పట్ల cm ys jaganmohan reddy తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

TDP President చంద్రబాబు నాయడు టిటిడి ఓఎస్టీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమన్నారు. ఉదయాన్నే ఆయన మరణవార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు.నిత్యం వేంకటేశ్వర స్వామి సేవలో తరించే శేషాద్రి మృతి టీటీడీకి తీరనిలోటని అన్నారు. ఆయన టీటీడికి విశేషమైన సేవలందించిన శేషాద్రి తన చివరి క్షణంలోను స్వామివారి సేవకు పాటుపడుతూనే కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబబు పేర్కొన్నారు. 

READ MORE  తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆకస్మిక మృతి

జీవితాంతం శ్రీవారి సేవలో పునీతులైన తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ శ్రీ పాల శేషాద్రి(డాలర్ శేషాద్రి) గారి హఠాన్మరణం ఎంతగానో బాధించిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, హిందూ ధార్మికతకు ఆయన చేసిన సేవలు మరువరానివన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని దేవాదాయ మంత్రి vellampalli srinivas అన్నారు.

విశాఖపట్నంలో వుండగా ఆదివారం రాత్రి కాస్తా నలతగా ఉందని చెప్పి అలాగే నిద్రపోయారు శేషాద్రి. సోమవారం తెల్లవారుజామున లేచినతర్వాత కూడా ఆరోగ్య పరిస్థితి అలాగే వుండటంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన గుండెపోటు రావడంతో మార్గమధ్యలోనే కన్నుమూసారు. 

డాలర్ శేషాద్రి మరణవార్త టిటిడి అర్చకులతో పాటు సిబ్బంది, శ్రీవారి భక్తులను కలచివేసింది. నిత్యం శ్రీవారిసేవలో తరించే ఆయన మరణవార్తతో తిరుమలలో విషాదం నెలకొంది. శేషాద్రి అంత్యక్రియలు మంగళవారం జరిగే అవకాశాలున్నాయి. 

read more  Sivasankar Master Death: శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. కరోనా బారినపడి, మృత్యువుతో పోరాడి ఓడిన ప్రతిభాశాలి

1978 నుంచి డాలర్ శేషాద్రి తిరుమల శ్రీవారి సేవలో ఉంటూ వస్తున్నారు. ఆయన 2007లో పదవీ విరమణ చేశారు. అయితే ఆయన సేవలు అత్యవసరం కావడంతో ఓఎస్డీగా కొనసాగించారు. ఆయన దాదాపు 43 ఏళ్ల పాటు శ్రీవారి సేవలో తరలించారు. 

డాలర్ శేషాద్రికి  2003లో మూత్రపిండాల మార్పిడి జరిగింది. అయినప్పటికీ ఆయన ఇంతకాలం ఎలాంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా వున్నారు. ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్నింటిని ఆయన పర్యవేక్షిస్తూ వచ్చారు. అలాంటిది హఠాత్తుగా డాలర్ శేషాద్రి గుండెపోటుకు గురయ్యి మృతిచెందాడు. 

 
 

click me!