మందు బాబుల వింత పరిస్ధితి: ఇలా చేయండి అంటూ.. సీఎం జగన్ సూచనలు

Siva Kodati |  
Published : Apr 13, 2020, 02:27 PM IST
మందు బాబుల వింత పరిస్ధితి: ఇలా చేయండి అంటూ.. సీఎం జగన్ సూచనలు

సారాంశం

మద్యం దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి కాళ్లూ, చేతులు వణకడం, రాత్రిళ్లు నిద్రపట్టక పోవడం వంటి సమస్యలు పడుతున్న వారు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు

కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇళ్లను దాటి బయటకు రాకుండా ప్రభుత్వం కట్టదుదిట్టమైన చర్యలు తీసుకుంది.

దీని వల్ల అందరి బాధ ఒకటైతే మందు బాబుల పరిస్థితి మరొకటి. చుక్క పడనిదే పొద్దు గడవని మందుబాబులకు ఇప్పుడు మద్యం దొరక్కపోవడంతో వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. పెయింట్‌, వార్నిష్, సేవింగ్ క్రీమ్‌లను మందులా తాగేయడంతో పలువురు ప్రాణాలను కోల్పోయారు.

Also Read:కరోనాపై పోరాటానికి ప్రత్యేక యంత్రం... రాజధాని రోడ్లపై ప్రయోగం

కొందరైతే పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. వీరి పరిస్ధితిని అర్థం చేసుకున్న కొన్ని ప్రభుత్వాలు ప్రత్యేక సమయాల్లో వైన్స్ షాపులను తెరిపిస్తున్నారు. అయితె తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్ధితి వేరుగా ఉంది.

ఇరు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నాయి. అందులోనూ ఏపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకుంటోంది... లాక్‌డౌన్‌ను ఇందుకు వేదికగా మలచుకోవాలని చూస్తోంది.

అయితే మందుబాబుల పరిస్ధితి దారుణంగా ఉండటంతో అధికారులతో పాటు ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సూచనలు చేశారు. మద్యం దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి కాళ్లూ, చేతులు వణకడం, రాత్రిళ్లు నిద్రపట్టక పోవడం వంటి సమస్యలు పడుతున్న వారు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.

Also Read:ఏపీపై కరోనా పంజా: 12 గంటల్లో 12 కొత్త కేసులు, మొత్తం 432కి చేరిక

నిద్రపట్టని వాళ్లు పిల్లలతో ఆడుకోవాలని, టీవీ చూస్తూ కాలక్షేపం చేయాలని సీఎం తెలిపారు. గార్డెనింగ్, వ్యాయామం, తరచూ నీళ్లు తాగడం 8 నుంచి 9 గంటల నిద్రపోవడం వల్ల మానసిక సమస్యలు దూరమవుతాయని జగన్ వెల్లడించారు.

కాళ్లు, చేతులూ వణికితే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలన్నారు. కాగా మందు మానేయాలని భావిస్తున్న వారికి లాక్‌డౌన్ ఒక వరమని, కుటుంబ ఆర్ధిక పరిస్ధితులు మెరుగుపరచుకోవడానికి లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్