ఫోన్ కొట్టు-పండ్లు పట్టు... హైదరాబాదీల కోసం మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు

Arun Kumar P   | Asianet News
Published : Apr 13, 2020, 01:22 PM IST
ఫోన్ కొట్టు-పండ్లు పట్టు... హైదరాబాదీల కోసం మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు

సారాంశం

లాక్  డౌన్ నేపథ్యంలో అటు రైతులు ఇటు వినియోగదారుల సౌలభ్యం కోసం మార్కెటింగ్ శాఖ వినూత్న ప్రయత్నం చేసింది. 

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రబలకుండా రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో అటు రైతులకు ఇటు వినియోగదారులకు అండగా వుండేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్కెటింగ్ అధికారులు హైదరాబాద్ లో ఇంటివద్దకే పండ్ల సరఫరా చేస్తున్నారు.  

మార్కెటింగ్ శాఖ చేస్తున్న ఈ ప్రయత్నానికి ఆదరణ పెరుగుతోంది. జంటనగరాల్లోని కాలనీలు, అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు 30 ప్యాక్ లు ఆర్డర్ ఇస్తే నేరుగా సరఫరా చేస్తున్నారు. రూ.300 లకు మామిడి 1.5 కేజీ, బొప్పాయి 3 కిలోలు, సపోట 1 కేజీ, బత్తాయి 2.5 కేజీలు, 12 నిమ్మకాయల ప్యాక్, 4 కిలోల కలంగిరి అందిస్తున్నారు. 

ఇందుకోసం 30 టన్నుల బత్తాయి, 10 టన్నుల మామిడి, 6 టన్నుల సపోట, 8 టన్నుల కలంగిరి (వాటర్ మిలన్), 2 టన్నుల నిమ్మ, 10 టన్నుల బొప్పాయి సరఫరాకు సిద్దం చేసినట్లు తెలిపారు. 7330733212 కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే ఇంటివద్దకే నాణ్యమైన పండ్లు అందిస్తున్నారు. ఇలా ఉద్యాన పంటల రైతులను ఆదుకునేందుకు చేపట్టిన ప్రయోగం సత్పలితాలిస్తోంది. 

వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు,  రవికుమార్ , జేడీ శ్రీనివాస్, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ నర్సింహారెడ్డిల ఆధ్వర్యంలో పంపిణీ కొనసాగుతోంది. 

లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్తరాదికి  బత్తాయి, మామిడి ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రజలు బయటకు రాకపోవడంతో స్థానికంగా అమ్ముకునేందుకు కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది. 

ఇప్పటికే మొబైల్ రైతుబజార్ల ద్వారా రోజుకు 550 కేంద్రాలలో ప్రజల వద్దకు పండ్లు, కూరగాయలు  చేరవేస్తున్నారు. వారానికి జంటనగరాలలోని 3500 పై చిలుకు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. పండ్ల సరఫరాకు ప్రత్యేక కార్యాచరణతో రైతులకు ఉపశమనం కలిగింది. 

పండ్లను వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతుల వద్ద నుండి నేరుగా సేకరిస్తున్నారు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు. వీలయినన్ని ఎక్కువ మొత్తంలో పండ్ల సరఫరాకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  సంబంధిత అధికారులను ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

అచ్చెన్నాయుడు స్పీచ్ కి సీఎం చంద్రబాబు ఫిదా | Achchennaidu Powerful Speech | Asianet News Telugu
మహానాడు లో మంత్రి నిమ్మల పవర్ ఫుల్ స్పీచ్ | Nimmala Ramanaidu Speech | Asianet News Telugu