వైఎస్ఆర్ సీపీ ప్లీనరీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు సహా విపక్షాలపై మండిపడ్డారు. 14 ఏళ్ళ పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా ఉందా అని ఆయన అడిగారు. పేద ప్రజల కోసం తమ ప్ర?భుత్వం అనేక కార్యక్రమాలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
గుంటూరు :మనది నిండు గుండెతో మంచి చేస్తున్న ప్రభుత్వం కాబట్టే వారి గుండెలు బద్దలవుతున్నాయని ఏపీ సీఎం YS Jagan చెప్పారు..మన గెలుపు ఆపటం వారి వల్ల కాదు కాబట్టి రాక్షస గణాలన్నీ కూడా ఒక్కటవుతున్నాయని జగన్ విమర్శించారు.
శుక్రవారంనాడు YSRCP Plenary ని వైఎస్ జగన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రారంభోపాన్యాసం చేశారు. చంద్రబాబుకు దుష్ట చతుష్టయం అండగా నిలిచిందన్నారు. చంద్రబాబుకు దుష్టచతుష్టయంగా ఉన్న ఎల్లో మీడియా తో పాటు దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ కూడా కలిశాడని జగన్ విమర్శించారు.
మనం మాత్రం జనం ఇంట ఉన్నాం. జనం గుండెల్లో ఉన్నాం. గజదొంగల ముఠా మాత్రం ఎల్లో టీవీలలో మాత్రమే ఉందన్నారు. ఎల్లో పేపర్లలో, ఎల్లో సోషల్ మీడియాలో మాత్రమే ఉందని జగన్ చెప్పారు. వారికి మనకీ పోలిక ఎక్కడ? మన చేతల పాలనకు, వారి చేతగాని పాలనకూ మధ్య పోటీనా ? మన నిజాలకు వారి అబద్దాలకు మధ్య పోటీనా ? మన నిజాయితీకి వారి వంచనకు మధ్య పోటీనా ? అని జగన్ అడిగారు.
ప్రజా జీవితంలో మంచి చేసిన చరిత్ర లేని Chandrababu మంచి చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. అందుకే రాష్ట్రంలో కులాల కుంపట్లు, మతాల మంటలు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. పచ్చి అబద్దాలతో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
గజదొంగల ముఠాను, ఎల్లో మీడియా రాతలను, పైచాశిక మాటలకు ఇంటింటికి తిరిగి సమాధానం ఇవ్వనున్నట్టుగా జగన్ చెప్పారు. మూడేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క స్కీమైనా ఉందా అని జగన్ ప్రశ్నించారు. నవరత్నాలులోని ప్రతి స్కీమ్ ను అమలు చేశామని జగన్ గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకొనేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు గాను కట్టుకథల్ని, పచ్చి బూతుల్ని, అబద్దాలను ప్రచారం చేసే వాళ్లు ఇవాళ టీవీలు, పత్రికలు నడుపుతున్నారన్నారు.
also read:అధికారమంటే అహంకారం కాదని నిరూపించాం: వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో జగన్
అధికారాన్ని అడ్డుపెట్టుకని గతంలో వీరంతా బాగా మెక్కేసారని ఆయన చెప్పారు. . గతంలో బాగా నొక్కేసారు. బాగా దోచుకుని పంచుకున్నారన్నారు. ఇప్పుడు ఆ పంచుకోవడం ఆగిపోయింని చెప్పారు. . ఈ గజదొంగల ముఠాకు అందుకే నిద్రపట్టడం లేదని జగన్ చెప్పారు. గతంలో మాదిరిగా దోచుకో, పంచుకో అన్న పరిస్థితి ఇప్పుడు లేదని జగన్ చెప్పారు.దోచుకొనే పరిస్థితి లేనందునే వీరికి కడుపు మంట కలుగుతుందన్నారు. ప్రజా జీవితంలో మన పార్టీ ఏం చేసిందో ఎలాంి మార్పులకుశ్రీకారం చుట్టామో ప్రజల కళ్లకు కట్టినట్టుగా కన్పిస్తుందన్నారు.ఇది చూసి గిట్టని వారే అసూయతో విమర్శలు చేస్తున్నారని ఆయన విపక్షాలపై మండిపడ్డారు.