
తెలుగు గడ్డపై గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయి.. కాల గర్భంలో కలిసిపోయాయని అన్నారు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (chevireddy bhaskar reddy) . శుక్రవారం గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో (ysrcp plenary) ఆయన మాట్లాడుతూ.. ఓ వ్యక్తి కష్టం నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మా బిడ్డ వున్నాడని గర్వంగా చెప్పుకునేలా జగన్ పాలన సాగిస్తున్నారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. పేద విద్యార్ధులను సొంత అన్నలా చదివిస్తున్న నాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. పిల్లలకు మంచి చదువులు చదివించాలన్న ఆలోచనలతో విద్యాదీవెన, అమ్మఒడి, వసతి దీవెన వంటి పథకాలను అమలు చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
ALso REad:కరోనాను, తుఫాన్లను ఆపేస్తానంటారు.. బాబు మాటలకు జనం నవ్వుకుంటున్నారు: ప్లీనరీలో మంత్రి బుగ్గన
అనంతరం మంత్రి విడదల రజనీ (vidadala rajini) మాట్లాడుతూ.. జగన్ ఎంతోమంది లీడర్లను తయారు చేశాడని అన్నారు. మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా జగనన్న పాలన వుందని రజనీ ప్రశంసించారు. వైసీపీ ప్రస్థానం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీతో మొదలైందని ఆమె గుర్తుచేశారు. టీడీపీ పాలనలో కంటే ఎక్కువ మంది ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తున్నామని రజనీ అన్నారు. జగనన్న పాలన ప్రజాహితం, పేదల పక్షమని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయని మంత్రి వెల్లడించారు. పేదరికానికి వైద్యం అందిస్తున్న ఏకైక డాక్టర్ వైఎస్ జగన్ అని రజనీ అభివర్ణించారు. చంద్రబాబు ఆరోగ్య రంగానికి ఉరేస్తే.. జగన్ ఊపిరి పోశారని మంత్రి అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ.. ఓడిపోయే టీడీపీకి మాటలు ఎక్కువంటూ రజనీ సెటైర్లు వేశారు.