అక్రమాస్తుల కేసు: తప్పనిసరి పరిస్థితుల్లో, ఎల్లుండి సీబీఐ కోర్టుకి జగన్

By Siva Kodati  |  First Published Jan 8, 2020, 9:42 PM IST

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. 


అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. వైఎస్ జ‌గన్ కు  సీబీఐ కోర్టు శుక్రవారం నాడు షాకిచ్చింది. ఈ నెల 10 వ తేదీన  కోర్టుకు జగన్ హాజరుకావాల్సిందేనని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు జగన్ లాయర్లకు సీబీఐ జడ్జి ఆదేశాలిచ్చారు.

Also Read:జగన్‌కు సీబీఐ కోర్టు షాక్: కీలక ఆదేశాలు

Latest Videos

undefined

ప్రతి శుక్రవారం నాడు  సీబీఐ కోర్టుకు హాజరు కావాలనే విషయమై మినహాయింపును ఇవ్వాలని గతంలో కూడ కోర్టును జగన్ తరపున లాయర్లు కోరారు. ఇప్పటికే 10 దఫాలు జగన్ కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు ఇచ్చిన విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

ఈ నెల 10వ తేదీన సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్ తో పాటు ఏ 2 గా ఉన్న  విజయసాయిరెడ్డి కూడ కోర్టుకు హాజరుకావాలని కూడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది

.Also Read:ఆరేళ్లలో ఏనాడైనా ఆరోపణలు వచ్చాయా....?: సీబీఐ కోర్టులో సీఎం జగన్

దేశంలోని పలువురు ప్రజా ప్రతినిధులపై కేసులు ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ఈ కేసుల్లో ఆయా సందర్భాల్లో  ప్రజా ప్రతినిధులు కోర్టుకు హాజరైన విషయాన్ని కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది.

చట్టానికి ఎవరూ కూడ అతీతులు కారని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ నెల 10వ తేదీన మాత్రం కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపును ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు 2019 నవంబర్ 1వ తేదీన కొట్టేసింది. 

click me!