అమరావతి వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో బుధవారం పాదయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అమరావతి జేఏసీ నేతలను పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు
అమరావతి వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో బుధవారం పాదయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అమరావతి జేఏసీ నేతలను పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో వీరిని పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు గాను పోలీసులు వ్యాన్ ఎక్కించారు. అయితే ఆ వాహనం ‘కీ’ మాయం కావడంతో బండి అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. కీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Also Read:బెజవాడ: చంద్రబాబు సహా అమరావతి జేఏసీ నేతల అరెస్ట్, ఉద్రిక్తత
విజయవాడ బెంజిసర్కిల్‌లోని అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేదిక కల్యాణ మండపం వద్ద పరిరక్షణ సమితి కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణతో పాటు జేఏసీ నేతలు పాదయాత్రగా వెళ్లారు.
ఈ క్రమంలో నేతలను పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు వారితో వాగ్వాదానికి దిగారు. ప్రజలు తిరగబడితే ఏమి చేయలేరంటూ మండిపడ్డారు. అనంతరం చంద్రబాబుతో పాటు ఇతర నేతలంతా రోడ్డుపైనే బైఠాయించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నించారు.
Also Read:Video : రాజధాని తరలిపోతుందని.. మనసు వికలమై...
తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని... ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని బాబు నిలదీశారు. ఏ చట్టం ప్రకారం తమను అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రతిపక్షనేత పోలీసులు తెలిపారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ బుధవారం బస్సు యాత్ర నిర్వహిస్తామని, అడ్డుకున్న బస్సులను వదలాలని టీడీపీ చీఫ్ పోలీసులను డిమాండ్ చేశారు.