రేపటి అమరావతి అంబేద్కర్ పండక్కి ఏర్పాట్లివే...

Published : Apr 13, 2017, 11:22 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
రేపటి అమరావతి అంబేద్కర్ పండక్కి ఏర్పాట్లివే...

సారాంశం

అంబేద్కర్ హిందూ ధర్మం వదిలేసి బౌద్ధంలోకి మారినా, ఉదయం 10 నుంచి 10.30 గంటల మధ్య  ముఖ్యమంత్రి  ముహూర్తం ప్రకారం శంకుస్థాపన చేస్తారు.  అంబేద్కర్ ఆశయాలకు తాను ఎలా కట్టుబడి ఉన్నానో చంద్రబాబు నాయుడు వివరిస్తారు.

 

రాజధాని ప్రాంతంలో అంబేద్కేర్‌ స్మృతివనానికి  రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన అట్టహాసంగా చేయబోతున్నారు.

ఇాది అంబేద్కర్ పండగా లాగా చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.

అమరావతిలో స్మృతి వనా ఏర్పాటుకు ప్రభుత్వం బడ్జెట్‌లో 97.64 కోట్లను కేటాయించింది. దీనికోసం ఐనవోలు రెవెన్యూలో 20 ఎకరాలను కేటాయించారు. 

ఇందులో 125 అడుగుల అంబేద్కర్‌ క్యాంస్య విగ్రహం, గ్రంథాలయాన్ని నెలకొల్పుతారు. శుక్రవారం శంకుస్థాపన నిర్వహించనున్నారు.

అంబేద్కర్ హిందూ ధర్మం వదిలేసి బౌద్ధంలోకి మారినా, ఉదయం 10 నుంచి 10.30 గంటల మధ్య  ముఖ్యమంత్రి  ముహూర్తం ప్రకారం శంకుస్థాపన చేస్తారు. 

 

బాబా సాహేబ్  అంబేద్కర్ జన్మస్ధలంమధ్యప్రదేశ్ ఇండోర్ మౌ ప్రాంతం సేకరించిన పవిత్రమైన మట్టి, నీరు  జూపూడి, ఎమ్మెల్యే డేవిడ్ రాజు తీసుకువచ్చారు. ఇదే విధంగా పార్లమెంటు నుంచి కూడా మట్టి ని సేకరించారు.

వీటన్నింటిని రేపు స్మృతి వనం శంకుస్థాపనంలో వేస్తారు.తాము ఎంత భక్తితో, అంకిత భావంతో అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్నామో తెలియచేపేందుకు ఈ తతంగమని ప్రభుత్వం చెబుతోంది. ఇలా ఇంతవరకు ఎవరూ అంబేద్కర్ వూరి మట్టిని వాడుకోలేదట.

 

శంకుస్థాపన అనంతరం బహిరంగ సభ నిర్వహించటానికి సచివాలయం వద్ద తూర్పు వైపున అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రజలు కూర్చోవటానికి భారీగా టెంట్లు వేస్తున్నారు. 

సుమారు 25 వేల మంది బహిరంగ సభకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఎండాకాలం నేపథ్యంలో సభకు హాజరయ్యే వారికి పుష్కలంగా తాగు నీరు అందించటానికి చర్యలు తీసుకుంటున్నారు. 

తాగునీటితో పాటు మజ్జిగ ప్యాకెట్లను అందజేస్తారు. 

మధ్యలో స్నాక్స్‌ కూడా పంపిణీ చేస్తారు. సీఎం 11 గంటలకు బహిరంగ సభ వేదికపైకి చేరుకుని 12 గంటల వరకు ఉంటారు.

కలెక్టర్‌ కాంతిలాల్‌దండే, సీఎం భద్రతా సిబ్బంది బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. 

సీఎం రెస్ట్‌ హౌస్‌ నుంచి రోడ్డుమార్గంలో స్మృతివన శంకుస్థాపన ప్రదేశానికి చేరుకుంటారు. 

ఇందుకు సచివాలయం దాటిన తరువాత విట్‌ కాలేజీ పక్కగా ప్రత్యేక రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. 

మంత్రులు , ఎమ్మెల్యేలు, శంకుస్థాపన చూడటానికి వచ్చే ప్రజల కోసం ఐనవోలు శాఖమూరు మధ్యలో ప్రస్తుతం ఉన్న రోడ్డు నుంచి శంకుస్థాపన ప్రదేశం వరకు మరో రోడ్డును వేస్తున్నారు. 

శంకుస్థాపన వద్ద సీఎంతో పాటు సుమారు వెయ్యి మంది ఉంటారని అంచనా వస్తున్నారు. 

రాష్ట్రం నలుమూలల నుంచి దళిత సంఘాల నాయకులు, సభ్యులు శంకుస్థాపనకు హాజరు కానున్నారు.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu