గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో గర్భిణీకి శస్త్ర చికిత్స నిర్వహించిన ఎనిమిది మంది వైద్యులతో పాటు ఇద్దరు నర్సులు, నాలుగో తరగతి సిబ్బందిని అధికారులు క్వారంటైన్ కి తరలించారు.
అమరావతి: గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో గర్భిణీకి శస్త్ర చికిత్స నిర్వహించిన ఎనిమిది మంది వైద్యులతో పాటు ఇద్దరు నర్సులు, నాలుగో తరగతి సిబ్బందిని అధికారులు క్వారంటైన్ కి తరలించారు.
గుంటూరు పట్టణానికి చెందిన ఓ గర్భిణీ ప్రసవం కోసం జీజీహెచ్ ఆసుపత్రిలో ఈ నెల 7వ తేదీన చేరింది.ఆమెకు డెలీవరి సమయం దగ్గర పడడంతో ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు.
undefined
ఆమెకు డెలీవరీ నిర్వహించే సమయంలో ఆమెకు కరోనా ఉన్న విషయం వైద్యులకు తెలియదు.ఈ ఆసుపత్రిలో చేరడానికి ముందే ఆమె నుండి శాంపిల్స్ సేకరించారు.
also read:ప్రారంభమైన ఏపీ కేబినెట్:నిమ్మగడ్డ సహా పలు కీలకాంశాలపై చర్చ
శస్త్రచికిత్స చేసిన తర్వాత ఆమెకు కరోనా ఉన్నట్టుగా రిపోర్టు వచ్చింది. ఈ నెల 7వ తేదీన ఆమెకు సిజేరియన్ చేశారు. ఈ నెల 9వ తేదీన ఆమెకు కరోనా ఉన్నట్టుగా రిపోర్టు వచ్చింది.
ఈ మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులకు ఈ విషయాన్ని అదికారులు చేరవేశారు. బాలింతను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆమెకు పుట్టిన శిశువుకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.శస్త్రచికిత్స చేసిన ఎనిమిది మంది వైద్యులు, ఇద్దరు నర్సులు, నాలుగో తరగతి ఉద్యోగులను వెంటనే హొం క్వారంటైన్ కు తరలించారు.