దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం : రేణిగుంటకు చేరుకున్న అమిత్ షా.. స్వాగతం పలికిన జగన్

Siva Kodati |  
Published : Nov 13, 2021, 10:06 PM IST
దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం : రేణిగుంటకు చేరుకున్న అమిత్ షా.. స్వాగతం పలికిన జగన్

సారాంశం

దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో (southern zonal council meeting) పాల్గొనేందుకు గాను కేంద్ర హోంమంత్రి (union home minister) అమిత్ షా (amit shah) తిరుపతి (tirupati) చేరుకున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి (renigunta airport) చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ (ys jagan) స్వయంగా స్వాగతం పలికారు.

దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో (southern zonal council meeting) పాల్గొనేందుకు గాను కేంద్ర హోంమంత్రి (union home minister) అమిత్ షా (amit shah) తిరుపతి (tirupati) చేరుకున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి (renigunta airport) చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ (ys jagan) స్వయంగా స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రోజా తదితరులు ఉన్నారు. అనంతరం అమిత్ షా, సీఎం జగన్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు.

కాగా, అమిత్ షా రాక నేపథ్యంలో రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద బీజేపీ శ్రేణుల కోలాహలం నెలకొంది. అమిత్ షా ఎయిర్ పోర్టు నుంచి వెలుపలికి రాగానే బీజేపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో వారికి అభివాదం చేసిన అమిత్ షా.. సీఎం జగన్ తో కలిసి తిరుమల పయనం అయ్యారు. 

ALso Read:Amit Shah Tour: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో మార్పులు.. వివరాలు ఇవే..

తిరుమల శ్రీవారి దర్శనం ముగిసిన అనంతరం.. అమిత్ షా తిరుపతికి చేరుకుంటారు. అక్కడ తాజ్‌ హోటల్‌లో అమిత్ షా రాత్రి బస చేయనున్నారు. ఆదివారం ఉదయం నెల్లూరులో స్వర్ణ భారతి ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్‌లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం దక్షిణాది జోనల్ కౌన్సిల్‌ బేటీలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, లెఫ్టినెంట్ గవర్నర్ లు కూడా పాల్గొననున్నారు. సోమవారం(నవంబర్ 15) రోజున శ్రీవారి దర్శనం అనంతరం అమిత్ షా తిరుగు ప్రయాణం అవుతారని తెలిపారు. కానీ తాజాగా ఆయన పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నట్టుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

అమిత్ షా పర్యటన నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు.  సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనున్న తిరుపతిలోని తాజ్ హోటల్‌ను శుక్రవారం పోలీసు ఉన్నతాధికరాులు పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. మరోవైపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో తిరుపతి, రేణిగుంట, నెల్లూరు ప్రాంతాలు నిఘా నీడలో ఉన్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Janhvi Kapoor Visits Tirumala | Walks Alipiri Footpath: శ్రీవారి సేవలో జాన్వీ కపూర్ | Asianet Telugu
CM Chandrababu Powerful Speech: అసెంబ్లీ లో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu