ప్రధానితో సీఎంల వీడియో కాన్ఫరెన్స్...మోదీని జగన్ కోరిందదే: ఆళ్ల నాని

By Arun Kumar PFirst Published Mar 20, 2020, 9:09 PM IST
Highlights

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంతో ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో చర్చించిన విషయాల గురించి మంత్రి ఆళ్ల నాని మాట్లాడారు. 

అమరావతి: దేశంలో కరోనా వైరస్ కోరలుచాస్తున్న నేపథ్యంతో నిరోధక చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులు, సంబంధిత అధికారులతో ప్రధాని మాట్లాడారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ కూడా ప్రధానితో మాట్లాడారని... వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కోడానికి సూచనలు, సలహాలు ఇచ్చారని ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. 

అంతకుముందు ముఖ్యమంత్రి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రస్తుత పరిస్థితిపై 13 జిల్లాల కల్లెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. వైరస్ కట్టడికి జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన అన్ని చర్యల గురించి సీఎం దిశా నిర్దేశం చేసినట్లు తెలిపారు. 

read more  ఉద్యమం ఉద్యమమే... కరోనా కరోనానే: అమరావతి పరిరక్షణ సమితి కీలక నిర్ణయం

ఇప్పటికే రాష్ట్రంలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఇంకా 119 అనుమానితులు నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపామని... అందులో 108 కేసులు నెగిటివ్ వచ్చాయని తెలిపారు. మరో 17 మంది రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉందన్నారు. 

రాష్ట్రాలకు కేంద్రంనుండి సహకారం కావాలని చాలా ముఖ్యమంత్రులు పీఎంను కోరినట్లు ఆళ్ల నాని పేర్కొన్నారు. అందులోభాగంగానే ఏపికి కొత్త లాబ్స్ అవసరం ఉందని... అందుకు కావాల్సిన సహకారం అందించాలని జగన్ కోరినట్లు తెలిపారు. అలాగే ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను ఇంకా ఎక్కువ కాలం బ్యాన్ చేయాలని సూచించారని... ఉపాధి కూలీలకు పని దినాలు, వేతనం పెంచాలని కోరినట్లు వెల్లడించారు. వీటిపై పీఎం భరోసా కూడా ఇచ్చినట్లు తెలిపారు.  

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తతతో ఉందన్నారు. బాధ్యతాయుతమైన మీడియా కూడా కరోనాకు సంబంధించి కూడా నిర్దారీత వార్తలనే జనాలకు అందించాలని సూచించారు. అవసరమయితే ఒకసారి తమతో సంప్రదించి నిర్ధారణ చేసుకున్న తర్వాతే వేయాలన్నారు. ప్రజలంతా పూర్తి సహకారం అందిస్తున్నారని.... వారికి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  

read more  కరోనా ఎఫెక్ట్: టీడీపీ కార్యాలయం మూసివేత, సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్

కరోనా వైరస్ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని... ప్రజలేవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రధాని మోదీ సూచించినట్లుగా జనతా కర్ఫ్యూకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. 

 

click me!