ఎవరికి ఎలా మేలు చేయాలనేదే ఆరాటం: వైఎస్ఆర్ నేతన్న నేస్తం మూడో విడత నిధుల విడుదల చేసిన జగన్

By narsimha lodeFirst Published Aug 10, 2021, 12:11 PM IST
Highlights

వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమం కింద మూడో విడత లబ్దిదారుల ఖాతాల్లో ఏపీ సీఎం వైఎస్  నగదు జమ చేశారు. రాష్ట్రంలోని 80,032 మంది నేతకార్మికులకు రూ. 192.08 కోట్లను మూడో విడత కింద జమ చేశారు సీఎం జగన్ ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

అమరావతి:ఎవరికి ఎలా మేలు చేయాలని తమ ప్రభుత్వం నిరంతరం ఆరాటపడుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్దిదారుల ఖాతాల్లో మంగళవారం నాడు నగదును జమ చేశారు. రాష్ట్రంలోని 80,032 మంది నేతకార్మికులకు రూ. 192.08 కోట్లను మూడో విడత కింద జమ చేశారు సీఎం జగన్ . ఈ సందర్భంగా వీడియో కాన్పరెన్స్ ద్వారా లబ్దిదారులతో ఆయన ప్రసంగించారు. మూడేళ్ల పాలన పూర్తికాకముందే మూడోవిడత నిధులను అందిస్తున్నామన్నారు. ఈ పథకం కింద లబ్దిదారులకు అందించే నిధులు నేత కార్మికులు మార్కెట్లో నిలదొక్కుకొనేందుకు ఉపయోగపడుతుందన్నారు.

ఒక్కో లబ్దిదారుడి ఖాతాల్లో రూ. 24 వేలు జమ కానుందని సీఎం  చెప్పారు. నేత కార్మికులు పడుతున్న ఇబ్బందులను తాను పాదయాత్రలో కళ్లారా చూశానని ఆయన గుర్తు చేసుకొన్నారు. రూ.600 కోట్లు నేరుగా నేతన్నలకు సహాయం అందించామని ఆయన తెలిపారు. అర్హులందరికీ లబ్ది చేకూరుతుందని ఆయన హామీ ఇచ్చారు.

అర్హత ఉండి జాబితాలో పేర్లులేని వారంతా ధరఖాస్తులు చేసుకోవాలని సీఎం కోరారు.  గ్రామ, వార్డు సచివాలయాల్లో నేరుగా ధరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేనేత కార్మికులకు ఈ కార్యక్రమం తీసుకురాలేదన్నారు. భవిష్యత్తులో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామని సీఎం తెలిపారు. అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తున్నామని సీఎం గుర్తు చేశారు.స్వంత మగ్గం ఉన్న వాళ్లకు ఐదేళ్లలో రూ 1.20 లక్షలను ఇస్తామన్నారు. పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరుగుతుందన్నారు.

click me!