ఎస్సై భార్య ఆత్మహత్య ! పట్టపగలు, పక్కగదిలో భర్త ఉండగానే ఘటన... !!

Published : Aug 10, 2021, 11:29 AM IST
ఎస్సై భార్య ఆత్మహత్య ! పట్టపగలు, పక్కగదిలో భర్త ఉండగానే ఘటన... !!

సారాంశం

ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక బెడ్ రూమ్ లో ఎస్ ఐ రవి కుమార్ ఉండగా, మరో బెడ్ రూమ్ లోకి ప్రసూన వెళ్ళింది. తలుపు గడియ పెట్టుకుంది.  ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో రవికుమార్ బెడ్రూమ్ వద్దకు వెళ్లి పిలిచాడు. పలకకపోవడంతో తలుపులు బద్దలు కొట్టాడు.

కడప : కడపలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో ఎస్సైగా పనిచేస్తున్న పెనుకొండ రవికుమార్ భార్య ప్రసూన (35) ఈ నెల 8న ఆత్మహత్యకు పాల్పడింది.  సంఘటన జరిగిన వెంటనే ఆమెను  కడపలోని హోలిస్టిక్‌ ఆస్పత్రిలో వైద్య సేవల కోసం  చేర్పించారు. సోమవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. 

ఈ సంఘటనపై మృతురాలి తండ్రి  గైక్వాడ్‌ వీరోజీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చిన్న చౌక్ ఎస్ఐ జి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పెనుగొండ రవి కుమార్ కు, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన  గైక్వాడ్‌ వీరోజీరావు కుమార్తె ప్రసూనకు 2011లో వివాహమైంది.  

2012 బ్యాచ్ కు చెందిన రవికుమార్ శిక్షణను పూర్తి చేసుకుని 2014 ప్రారంభంలో ఎస్సైగా విధుల్లో చేరారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.  జైన శ్రీపాద (8),  స్పోహిత (6) ఉన్నారు.  వీరు ప్రస్తుతం కడప లోని ఓం శాంతి నగర్ లో ఉంటున్నారు.

రవికుమార్ ప్రస్తుతం కడప లోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఎస్‌ఐగా విధులను నిర్వహిస్తున్నారు. ప్రసూన అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధ పడేదని,  ఆస్పత్రులకు తిరిగేవారమని ఆమె తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక బెడ్ రూమ్ లో ఎస్ ఐ రవి కుమార్ ఉండగా, మరో బెడ్ రూమ్ లోకి ప్రసూన వెళ్ళింది. తలుపు గడియ పెట్టుకుంది.  ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో రవికుమార్ బెడ్రూమ్ వద్దకు వెళ్లి పిలిచాడు. పలకకపోవడంతో తలుపులు బద్దలు కొట్టాడు.

వెళ్లి చూడగా,  ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉంది.  వెంటనే కిందికి దించి ప్రధమ చికిత్స చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆమె సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu