ప్యాకేజీ, ఓటుకు నోటు కేసు కోసం గత ప్రభుత్వం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.
అమరావతి: ప్యాకేజీ, ఓటుకు నోటు కేసు కోసం గత ప్రభుత్వం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.శుక్రవారం నాడు జాబ్ కేలండర్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గత ప్రభుత్వం మాటలతో భ్రమ కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక హోదా గురించి తాను కేంద్రంతో చర్చిస్తున్నానని ఆయన వివరించారు.
ప్యాకేజీ, ఓటుకు నోటు కేసు కోసం గత ప్రభుత్వం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.శుక్రవారం నాడు జాబ్ కేలండర్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. pic.twitter.com/r24Y1TCkm4
— Asianetnews Telugu (@AsianetNewsTL)
ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల్లో కూడ సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆదాయం తగ్గినా అభివృద్ది కార్యక్రమాలు ఆపలేదన్నారు. రైతులకు అండగా గ్రామాల్లో ఆర్‌బీకేలు నిలుస్తున్నాయని చెప్పారు. గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. నాణ్యమైన విద్యను తీసుకొచ్చేలా మార్పులు తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు.
అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా పథకాలను అమలు చేసినట్టుగా ఆయన చెప్పారు. ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిపికేషన్ ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. కానీ తమ ప్రభుత్వం జాబ్ కేలండర్ ను విడుదల చేసి దాని ప్రకారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని సీఎం వివరించారు. వచ్చే 9 మాసాల కాలంలో 10, 143 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. చదువులు పూర్తి చేసుకొన్నవారందరి కోసం ఈ జాబ్ కేలండర్ విడుదల చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తోందో స్పష్టంగా చెప్పడమే ఈ జాబ్ కేలండర్ ఉద్దేశ్యమని జగన్ తెలిపారు.