ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపు ఇస్తూ శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపు ఇస్తూ శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు అమల్లో ఉంటుంది. ఈ నెల 30వ తేదీ వరకు కర్ఫ్యూ సడలింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 20 నుండి కర్ఫ్యూ సడలింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపు ఇస్తూ శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు అమల్లో ఉంటుంది. pic.twitter.com/4i6zqCXwOs
— Asianetnews Telugu (@AsianetNewsTL)
కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకే సడలింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. సాయంత్రం ఐదు గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే కర్ఫ్యూ సడలింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మే 5వ తేదీ నుండి రాష్ట్రంలో పగటిపూట కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేసింది. తొలుత ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే ఆంక్షల సడలింపు కొనసాగింది. ఆ తర్వాత కర్ఫ్యూ సమయాన్ని ప్రభుత్వం పెంచింది.