పవన్ వల్లే టీడీపీ గెలవలేదు, స్థానిక సంస్థల్లో ఒంటరిగా గెలిచాం:చినరాజప్ప

Published : Nov 05, 2018, 05:52 PM IST
పవన్ వల్లే టీడీపీ గెలవలేదు, స్థానిక సంస్థల్లో ఒంటరిగా గెలిచాం:చినరాజప్ప

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించిన ఆయన పవన్ కళ్యాణ్ వల్లే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు.   

ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించిన ఆయన పవన్ కళ్యాణ్ వల్లే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. 

జనసేన అండవల్లే టీడీపీ గెలిచిందని అంటున్న పవన్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. పవన్ కళ్యాణ్ లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించిందని అది గుర్తుంచుకోవాలన్నారు. 

మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు రాష్ట్రప్రయోజనాల కోసమేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ అన్యాయం చేయడం వల్లే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేం‍ద్రంలో ఎవరో ఒకరి సహకారం ఉండాలన్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కళ్యాణ్ ఓ అవివేకి:డొక్కా ఫైర్

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?