చిల్లర రాజకీయాలు మానుకో: మాణిక్యాల రావుకు చంద్రబాబు వార్నింగ్

Published : Dec 25, 2018, 03:14 PM IST
చిల్లర రాజకీయాలు మానుకో: మాణిక్యాల రావుకు చంద్రబాబు వార్నింగ్

సారాంశం

మాజీ మంత్రి తాడేపల్లి గూడెం బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. చిల్లర రాజకీయాలు చెయ్యడం మానుకోవాలని హితవు పలికారు. రాజీనామా పేరుతో బెదిరించడం సరికాదన్నారు. 

అమరావతి: మాజీ మంత్రి తాడేపల్లి గూడెం బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. చిల్లర రాజకీయాలు చెయ్యడం మానుకోవాలని హితవు పలికారు. రాజీనామా పేరుతో బెదిరించడం సరికాదన్నారు. 

తాడేపల్లి గూడెం నియోజకవర్గాన్ని మాత్రమే కాదని రాష్ట్రం మెత్తాన్ని అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదంటూ రాజీనామా చెయ్యడం కాదని, పోలవరంపై కేంద్రంతో పోరాడి రాజీనామా చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 

తెలుగుదేశం పార్టీకి పశ్చిమగోదావరి జిల్లా కంచుకోట అని చంద్రబాబు తెలిపారు. ఆ జిల్లాను అభివృద్ధి పథంలో తాను నడిపిస్తున్నట్లు తెలిపారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తూ రాజీనామాలు చెయ్యడం సరికాదన్నారు. 

ఇకపోతే తన నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చెయ్యడం లేదని, ఎన్నిసార్లు చంద్రబాబును కలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మంగళవారం తన ఎమ్మెల్యే పదవికి మాజీమంత్రి మాణిక్యాలరావు రాజీనామా చేశారు. 

తాను రాజీనామా చేసి 15 రోజులపాటు వేచి చూస్తానని అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు నియోజకవర్గ అభివృద్ధిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతే 16వ రోజు నుంచి నిరవధిక దీక్ష చేస్తానంటూ అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మాణిక్యాలరావుకు కౌంటర్ ఇచ్చారు. వీరిద్ధరి మధ్య పోరు ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి.  

ఈ వార్తలు కూడా చదవండి

ఇలాంటి శాసన సభలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: ఎమ్మెల్యే రాజీనామా, ఇరుక్కున్న చంద్రబాబు

మాజీ మంత్రి మాణిక్యాల రావు సంచలన నిర్ణయం

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu
Chandrababu Speech:నన్ను420అన్నా బాధపడలేదు | Siddhartha Academy Golden Jubilee | Asianet News Telugu