పశ్చిమబెంగాల్ విధ్వంసం: అమిత్ షా గూండాలపనేనన్న చంద్రబాబు

By Nagaraju penumalaFirst Published May 15, 2019, 3:25 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా మంగళవారం కావాలనే తన ర్యాలీలో గూండాలతో అల్లర్లు సృష్టించారని మండిపడ్డారు. గతంలో గుజరాత్‌లో కుడా అమిత్ షాను అడ్డుపెట్టుకొని మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన విషయం ప్రజలందరికీ తెలుసున్నన్నారు. 
 

అమరావతి: పశ్చిమబెంగాల్ లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన దాడిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పశ్చిమబెంగాల్ లో విధ్వంసం వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ ఆరోపించారు. ఎన్నికల సమయంలో భయాందోళన సృష్టించాలనే బీజేపీ బీ టీం గూండాలను రంగంలోకి దింపిందని ఆరోపించారు. 

సీబీఐ, ఈడీ, ఐటీ దాడులకు భయపడకపోవడంతో ఇక  నేరుగా దాడులకు పాల్పడుతున్నారంటూ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలపై విలువ లేని వారు మాత్రమే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు. 

మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగే కుట్ర అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై మండిపడ్డారు. ధర్మో రక్షిత రక్షిత: అనే సూక్తికి స్పూర్తికి విరుద్దంగా, హింస ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటే ఈ దేశం మొత్తం గుజరాత్ లా మోదీ- షాలను నమ్మి మోయడానికి సిద్దంగా లేదన్నారు. 

సీబీఐ-ఈడీ, ఐటీలకు బయపడలేదని, ఏన్నికల సమయంలో భయోత్పాతం సృష్టించే ప్రయత్నంలో భాగంగా బీజేపీ వారి బీ టీంలు గూండాలను నేరుగా రంగంలోకి తెచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలపై విలువ లేని వారు ఇటువంటి చర్యలకు పాల్పడుతారు. మమతా బెనర్జీ గారికి సంఘీబావం తెలుపుతూ అమీత్ షా చర్యలను ఖండిస్తున్నాం.

— N Chandrababu Naidu (@ncbn)

 

పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా మంగళవారం కావాలనే తన ర్యాలీలో గూండాలతో అల్లర్లు సృష్టించారని మండిపడ్డారు. గతంలో గుజరాత్‌లో కుడా అమిత్ షాను అడ్డుపెట్టుకొని మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన విషయం ప్రజలందరికీ తెలుసున్నన్నారు. 

పశ్చిమ బెంగాల్‌లో అసలు బలం లేని బీజేపీ, మమతా బెనర్జీపై రాక్షసుల్లా విధ్వంసం సృష్టించి, అక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు కల్పించి రాజకీయ పబ్బం గడుపుకుందామనే ఆలోచనలో మోదీ అమిత్ షాలు ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. వారి వికృత పాచిక పారదంటూ చంద్రబాబు హెచ్చరించారు. 

పశ్చిమ బెంగాల్‌లో అసలు బలం లేని బీజేపీ, సీనియర్ మహిళా నేత లాంటి మమతా బెనర్జీ గారిపైకి రాక్షసుల్లా విధ్వంసం సృష్టించి, అక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు కల్పించి రాజకీయ పబ్బం గడుపుకుందాం అనే వికృత మోదీ-షాల పాచిక పారదు.

— N Chandrababu Naidu (@ncbn)
click me!