హత్యలు చేసిన వారికే ఈ ఆలోచనలు, గుడ్డకాల్చి ముఖంమీద వేస్తావా... : వైఎస్ జగన్ పై చంద్రబాబు ఆగ్రహం

By Nagaraju penumalaFirst Published Mar 15, 2019, 10:09 PM IST
Highlights

నీ ఇంట్లో హత్య జరిగింది తనపై నెట్టే ప్రయత్నం చేస్తావా అంటూ నిలదీశారు. కుటుంబ సభ్యులను అనుమానించి విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పుకొచ్చారు. హత్యలు  చేసేవాళ్లకు నిత్యం అవే ఆలోచనలు వస్తాయన్నారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తారు అంటూ తిట్టిపోశారు. ఇలాంటి నేరగాళ్లు రాజకీయాల్లోఉండటం దురదృష్టకరమంటూ మండిపడ్డారు. 

కడప: మాజీమంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్యను తెలుగుదేశం పార్టీకి అంటగట్టడాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. వివేకానంద రెడ్డి హత్యకు గురవ్వడాన్ని తాను ఖండించానని తాను సంతాపం తెలిపామని గుర్తు చేశారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు మీ ఇంట్లో హత్య జరిగితే తదాన్ని ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తారా అంటూ మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో తన ప్రమేయం ఉందని, తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందని, లోకేష్ హస్తం ఉందంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. 

రెండు లీటర్ల రక్తం కారినట్లు తెలుస్తున్నప్పుడు ఎందుకు మృతదేహాన్ని బెడ్ రూమ్ లోకి తీసుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. బెడ్ రూమ్ ను బాత్ రూమ్ ను ఎవరు క్లీన్ చేశారు ఎందుకు సాక్షాలను తారుమారు చెయ్యాల్సి వచ్చిందో చెప్పాలనలి డిమాండ్ చేశారు. 

హార్ట్ ఎటాక్ తో చనిపోయిన వ్యక్తికి, హత్య చెయ్యడంతో చనిపోయిన వ్యక్తికి తేడా తెలియదా అంటూ ప్రశ్నించారు. ఉదయం 5.30కి చనిపోయారని తెలిసి 10 గంటల వరకు ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరిని కాపాడాలని ప్రయత్నించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

మెదడు బయటకు వచ్చేలా గాయాలు ఉంటే రక్తం కారుతుంటే అది హత్య అని ఆమాత్రం తెలియడం లేదా అని నిలదీశారు. ఉదయం లేని లెటర్ సాయంత్రానికి ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

తన తాత వైఎస్ రాజారెడ్డి, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, తన చిన్నాన్న మరణంపై తన హస్తం ఉందంటూ జగన్ చేసిన ఆరోపణలపై చంద్రబాబు ఖండించారు. నీ ఇంట్లో హత్య జరిగింది తనపై నెట్టే ప్రయత్నం చేస్తావా అంటూ నిలదీశారు. 

కుటుంబ సభ్యులను అనుమానించి విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పుకొచ్చారు. హత్యలు  చేసేవాళ్లకు నిత్యం అవే ఆలోచనలు వస్తాయన్నారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తారు అంటూ తిట్టిపోశారు. ఇలాంటి నేరగాళ్లు రాజకీయాల్లోఉండటం దురదృష్టకరమంటూ మండిపడ్డారు. 

సొంతచిన్నాన్న హత్యకు గురైతే దాన్ని కూడా రాజకీయం చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి శవరాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏదో అలజడి సృష్టించాలని వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.  

ఉదయం వరకు హార్ట్ ఎటాక్ అంటూ నమ్మించి ఆ తర్వాత డ్రామాలు ఆడుతున్నారంటూ విరుచుకు పడ్డారు. ప్రభుత్వం సిట్ వేశామని తొందర్లోనే నిందితులను పట్టుకుంటామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. హత్య ఘటనకు సంబంధించి సాక్ష్యాలను సేకరించడంలో సీఐ ఫెయిల్ అయ్యారని చంద్రబాబు  నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీ పోలీసులపై నమ్మకం లేదని వైఎస్ జగన్ అనడాన్ని తప్పుబట్టారు. వ్యవస్థలను నమ్మకపోతే ఎలా అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఉండటం లేదా అంటూ నిలదీశారు. ముందు వ్యవస్థలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే నమ్మాలి అనుకుంటే కుదరదన్నారు చంద్రబాబు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఇంట్లో వాళ్లు చేస్తేనే సాక్ష్యాలు తుడిచేస్తారు: వివేకా హత్యపై జగన్ మీద బాబు ఎదురుదాడి

నా తండ్రిని ప్రత్యర్థులే హత్య చేశారు:వైఎస్ వివేకా హత్యపై కుమార్తె సునీత ఫిర్యాదు

తలపై గొడ్డలితో నరికి చంపారు, డ్రైవర్ పై నెట్టే ప్రయత్నం : సిట్ దర్యాప్తుపై జగన్ ఫైర్

మా కుటుంబంలో జరిగిన ప్రతీ హత్య వెనుక చంద్రబాబు పాత్ర ఉంది: వైఎస్ జగన్

చంద్రబాబు సూత్రధారి, ఆదినారాయణరెడ్డి పాత్రధారి: వైఎస్ వివేకా హత్యపై విజయసాయిరెడ్డి

 

click me!