కొత్త పెన్షన్ విధానం, ప్రభుత్వ శాఖగా వైద్య విధాన పరిషత్ : ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

By Siva KodatiFirst Published Jun 7, 2023, 4:49 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు.
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు:

  • 12వ పీఆర్సీ నియామకానికి ఆమోదం
  • ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుకు ఆమోదం
  • కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం
  • 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల  రెగ్యులరైజేషన్‌కు ఆమోదం
  • అమ్మఒడి ఫథకం అమలుకు ఆమోదం
  • ఈ ఏడాది విద్యా కానుక పంపిణీకి ఆమోదం
  • జగనన్న ఆణిముత్యాలు పథకం అమలుకు ఆమోదం
  • జనవరి 1 , 2022 నుంచి ఉద్యోగులందరికీ ఏరియర్స్‌తో సహా 2.73 శాతం డీఏ
  • ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం అమలుకు ఆమోదం
  • నర్సాపురం ఫిషరీస్ కాలేజ్ అండ్ యూనివర్సిటీలో 140 పోస్టులకు ఆమోదం
  • జిల్లా కేంద్రాల్లో పనిచేసే వారికి 12 నుంచి 15 శాతం హెచ్ఆర్ఏ పెంపు
  • 476 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్‌మెన్ పోస్టులకు ఆమోదం
  • 6,840 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం
  • కడప మానసిక వైద్యశాలలో 116 పోస్టులకు ఆమోదం
  • కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 సహా మరిన్ని శాఖల్లో పోస్టులు
  • సీతానగరం పీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌కు 23 పోస్టుల భర్తీకి ఆమోదం
  • ప్రతీ మండలంలో 2 జూనియర్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం
  • ఒడిషా రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు ఆమోదం
  • కో ఆపరేటివ్ సోసైటీల్లో సూపర్ న్యూమరీ పోస్టులకు ఆమోదం
  • రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాల్లో అర్చకులకే నిర్వహణ బాధ్యత అప్పగిస్తూ నిర్ణయం
  • 3 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపునకు నిర్ణయం
  • చిత్తూరు డెయిరీకి 28.35 ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుకు ఇస్తూ నిర్ణయం
  • విశాఖ మానసిక వైద్యశాలలో 11 పోస్టుల మంజూరుకు ఆమోదం
  • అనంతపురం, సత్యసామి జిల్లాల్లో విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు
  • ఏపీ వైద్య విధాన పరిషత్ చట్టాన్ని రద్దు చేసి దాన్ని ప్రభుత్వ శాఖ గా మార్పు  చేస్తూ నిర్ణయం 
  • జూన్ 12 నుంచి 17 వరకూ విద్యా కానుక వారోత్సవాలు
  • గ్రీన్ హైడ్రోజెన్, అమ్మోనియా పాలసీకి కేబినెట్ ఆమోదం
  • హైడ్రోజెన్, అమ్మోనియా ఉత్పత్తి పరిశ్రమలకు ప్రోత్సాహం
  • గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సదుపాయం 5జి నెట్ వర్క్ కల్పించేందుకు ఏపీఎఫ్ఎస్ఎల్‌కు రూ. 445 కోట్ల రుణ సేకరణకు ఆమోదం
     
click me!