కష్టపడితే మళ్లీ అధికారం మనదే: ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన జగన్

By narsimha lode  |  First Published Jun 7, 2023, 3:47 PM IST

 గత కొన్ని రోజుల్లో  ముందస్తు ఎన్నికలపై  జరుగుతున్న ప్రచారంపై  ఏపీ సీఎం వైఎస్ జగన్  స్పష్టత  ఇచ్చారు.  షెడ్యూల్ ప్రకారంగానే  ఎన్నికలకు  వెళ్లనున్నట్టుగా  జగన్  చెప్పారు



అమరావతి:  షెడ్యూల్ ప్రకారమే  ఎన్నికలకు  వెళ్ళనున్నట్టుగా  ఏపీ సీఎం వైఎస్ జగన్ తేల్చి  చెప్పారు.  ముందస్తు  ఎన్నికలకు  జగన్ వెళ్లే  అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది.ఈ విషయమై  కేబినెట్ లో  సీఎం జగన్  మంత్రులకు  స్పష్టత  ఇచ్చారు.  ఏపీ కేబినెట్ సమావేశం బుధవారంనాడు  ఏపీ సచివాలయంలో  జరిగింది.  కేబినెట్  ముగిసిన  తర్వాత అధికారులు వెళ్లిపోయాక  మంత్రులతో  రాష్ట్ర రాజకీయాలపై  సీఎం జగన్ చర్చించారు.

మరో 9 మాసాల్లో ఏపీ రాష్ట్రంలో  ఎన్నికలు  జరగనున్నాయని సీఎం జగన్ మంత్రులకు  చెప్పారు.ఈ 9 మాసాల పాటు కష్టపడితే  మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని మంత్రులకు  జగన్   తెలిపారు.  ఈ 9 మాసాల పాటు  మంత్రులతో పాటు  పార్టీ నేతలంతా  కష్టపడాల్సిన అవసరం ఉందని సీఎం జగన్  చెప్పారు.  

Latest Videos

undefined

ముందస్తు  ఎన్నికల విషయమై  సాగుతున్న  ప్రచారంపై  కొందరు  మంత్రులు  సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. అయితే  ముందస్తు  ఎన్నికలకు వెళ్లే విషయాన్ని  వైఎస్ జగన్  కొట్టిపారేశారు.  షెడ్యూల్ ప్రకారంగానే  ఎన్నికలకు  వెళ్తామని  సీఎం జగన్  తేల్చి  చెప్పారు. 
ఈ 9 మాసాల పాటు  మీరంతా కష్టపడితే  మిగిలిన అంశాలపై  తాను  కేంద్రీకరించనున్నట్టుగా  సీఎం జగన్ మంత్రులకు  చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2024 ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో  జరగాలి. అయితే  ముందస్తు ఎన్నికలు  జరుగుతాయని  కొంత కాలంగా  జరుగుతుంది.  అయితే  ముందస్తు  ఎన్నికలకు వెళ్లడం లేదని  వైఎస్ జగన్  తేల్చి చెప్పారు.

also read:ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ: ఉద్యోగుల డిమాండ్లు సహా కీలకాంశాలపై చర్చ

2024 లో  ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్ఆర్‌సీ ఇప్పటినుండే వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఈ దఫా  టీడీపీని  అధికారంలోకి రాకుండా అడ్డుకుంటే  ఆ పార్టీ మనుగడ కష్టమని  వైఎస్ఆర్‌సీపీ భావిస్తుంది. అందుకే  రాష్ట్రంలోని  175  అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే  లక్ష్యంతో  వైఎస్ఆర్‌సీపీ ముందుకు  సాగుతుంది.  

ఇదిలా ఉంటే ఈ దఫా  అధికారంలోకి  రావాలని టీడీపీ అంతే పట్టుదలగా  ఉంది.  జనసేన, టీడీపీ మధ్య  పొత్తులు కుదిరే అవకాశం కన్పిస్తుంది. ఈ మేరకు రెండు పార్టీల నుండి  సంకేతాలు వెలువడ్డాయి

click me!