అగ్రిగోల్డ్ బాధితులకు తీపికబురు: రూ.1150కోట్లు జమచేయాలని కేబినెట్ నిర్ణయం

By Nagaraju penumalaFirst Published Jun 10, 2019, 7:59 PM IST
Highlights

అగ్రిగోల్డ్ ఆస్తుల మెుత్తాన్ని అంతా ఒకేసారి వేలం వేయకుండా ఆస్తులను కొన్ని విభాగాలుగా విభజించి అమ్మకాలు జరపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర హైకోర్టుకు సూచనలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.250 కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్‌ ఖాతాదారులను మోసం చేసిందని మంత్రి నాని ఆరోపించారు.  

అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీపికబురు చెప్పింది. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగేలా కీలక నిర్ణయం తీసుకుంటూ తీర్మానం చేసింది ఏపీ కేబినెట్. ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులపై సీఎం వైయస్ జగన్ చర్చించారు. 

ఈ నేపథ్యంలో రూ.1,150 కోట్లు హైకోర్టులో జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు తక్షణమే డబ్బు చెల్లించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వేలంలో అగ్రిగోల్డ్‌ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తామన్నారు. 

అగ్రిగోల్డ్ ఆస్తుల మెుత్తాన్ని అంతా ఒకేసారి వేలం వేయకుండా ఆస్తులను కొన్ని విభాగాలుగా విభజించి అమ్మకాలు జరపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర హైకోర్టుకు సూచనలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.250 కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్‌ ఖాతాదారులను మోసం చేసిందని మంత్రి నాని ఆరోపించారు.  

ఈ  వార్తలు కూడా చదవండి

టీటీడీ పాలకమండలి, నామినేటెడ్ పోస్టులు రద్దు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త: ఆర్టీసీ విలీనానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

click me!