టీటీడీ పాలకమండలి, నామినేటెడ్ పోస్టులు రద్దు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

By Nagaraju penumalaFirst Published Jun 10, 2019, 7:16 PM IST
Highlights

ఇకపోతే ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు తమ నామినేటెడ్ పోస్టులకు రాజీనామా చేశారు. అలాగే పలు పాలకమండళ్లి సైతం రద్దు అయ్యాయి. అలాగే దుర్గగుడికి సంబంధించి చైర్మన్ తోపాటు పలువురు సభ్యులు, అలాగే టీటీడీ బోర్డుకు సంబంధించి పలువురు సభ్యులు కూడా ఇప్పటికే రాజీనామా చేశారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలులో ఉన్న నామినేటెడ్ పోస్టులు, పాలకమండలి రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసినట్లు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. 

అలాగే పాలకమండళ్లను కూడా రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలని సైతం రద్దు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.    

ఇకపోతే ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు తమ నామినేటెడ్ పోస్టులకు రాజీనామా చేశారు. అలాగే పలు పాలకమండళ్లి సైతం రద్దు అయ్యాయి. అలాగే దుర్గగుడికి సంబంధించి చైర్మన్ తోపాటు పలువురు సభ్యులు, అలాగే టీటీడీ బోర్డుకు సంబంధించి పలువురు సభ్యులు కూడా ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు పుట్టా సుధాకర్ యాదవ్ అంగీకారం తెలపకపోవడంతో పాలకమండళ్లను రద్దు చేస్తున్నట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త: ఆర్టీసీ విలీనానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

click me!