ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు కానుక

By Nagaraju penumalaFirst Published Feb 8, 2019, 7:30 PM IST
Highlights

ఇకపోతే ఈ మధ్యంతర భృతి వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.6884 కోట్లు ఆర్థిక భారం పడనుంది. ఇకపోతే ప్రభుత్వం 20 శాతం మధ్యంతర భృతికి ఆమోదముద్ర వెయ్యడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 
 
అమరావతి: ఏపీ ఉద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరాలు కురిపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తీపికబురు అందించారు. 20శాతం మధ్యంత భృతి   ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం అమరావతిలో మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు.

 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సమావేశంలో మధ్యంతర భృతిపై చర్చించారు. ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ప్రకటించే అంశంపై అంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకారం తెలిపారు. 

ఇకపోతే ఈ మధ్యంతర భృతి వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.6884 కోట్లు ఆర్థిక భారం పడనుంది. ఇకపోతే ప్రభుత్వం 20 శాతం మధ్యంతర భృతికి ఆమోదముద్ర వెయ్యడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. 

click me!