రేపు గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ: ఓటర్ లిస్టు, ప్రమోషన్లపై ఫిర్యాదు

By Nagaraju penumalaFirst Published Feb 8, 2019, 7:13 PM IST
Highlights

ఇదే అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. ఓటర్ల జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల పేర్లు తొలగిస్తున్నారని అలాగే అనేక అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు చేశారు. 

అమరావతి: ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరును ఉధృతం చేసింది. ఓటర్ జాబితాలోని అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు నిరసనలు చేపట్టింది. 

ఇదే అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. ఓటర్ల జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల పేర్లు తొలగిస్తున్నారని అలాగే అనేక అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు చేశారు. 

తాజాగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిసేందుకు వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ ను జగన్ కలవనున్నారు. ఈ సందర్భంగా ఓట్ల తొలగింపు, ఓటర్ లిస్టులో అవకతవకలపై ఫిర్యాదు చేయనున్నారు. 

మరోవైపు ఏపీలో డీఎస్పీల ప్రమోషన్లపై కూడా గవర్నర్  నరసింహన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ జగన్ 35 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారని ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు.

అలాగే ఒక పోలీస్ అధికారికి లేని పోస్టులను సృష్టిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు వైఎస్  జగన్. ఇదే అంశంపై ఇప్పుడు గవర్నర్ నరసింహన్ కు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

click me!