కేసీఆర్ సర్కార్ పై ప్రధానికి ఫిర్యాదు... జలవివాదంపై అమీతుమీకి సిద్దమైన జగన్

By Arun Kumar P  |  First Published Jun 30, 2021, 4:08 PM IST

తెలంగాాణతో నదీజలాల వాడకం విషయంలో వివాదం చెలరేగుతున్న నేపథ్యలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 


అమరావతి: తెలంగాణతో జలవివాదం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఇక అమీతుమీ తేల్చుకోవాలని జగన్ సర్కార్ బావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ ప్రయోజనాలను దెబ్బతీస్తూ తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలని ఇవాళ సమావేశమైన ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. 

కేబినెట్ సహచరులతో సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని... అయినప్పటికి తెలంగాణలో వున్న మనవాళ్లను ఇబ్బంది పెడతారనే నేను ఎక్కువగా మాట్లాడటం లేదన్నారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారనే ఆలోచిస్తున్నామన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జగన్ హితవు పలికారు. 

Latest Videos

undefined

read more  విశాఖలో రెండెకరాల భూమి, ఐదులక్షల చెక్... పివి సింధుకు స్వయంగా అందించిన జగన్

శ్రీశైలం విద్యుదుత్పత్తతి ఆపేయాలని కేఆర్ఎంబీకి మరో లేఖ రాస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంత్రి చుక్కనీరు కూడా వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది ఏపీ కేబినెట్. నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సీఎం జగన్ ఆదేశించారు. 

జల వివాదంపైనే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకుంది. 

 ఏపీ కేబినెట్ నిర్ణయాలివే: 

రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం..

నవరత్నాల్లో భాగంగా 28లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమం.

9 నుంచి 12 వతరగతి విద్యార్ధులకు ల్యాప్ టాప్ ల పంపిణీకి ఆమోదముద్ర.

ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.

విజయనగరం జేఎన్ టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్పుకు ఆమోదం.

జేఎన్ టీయూ చట్టం 2008 సవరణకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం.

టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తికి మంత్రివర్గం ఆమోదం.

మౌలిక సదుపాయల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి ఆమోదం.

2021-24 ఐటీ విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.

కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చ.

మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతి.

రీసర్వే పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి భూహక్కు చట్ట సవరణకు ఆమోదం.

విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ భూ కేటాయింపునకు ఆమోదం.

81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం .

పుట్టపర్తి నియోజకవర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కింద నీటి సరఫరా.

తొలిదశ కింద ఎత్తిపోతల ,గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారం.

రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం.

విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం. 

click me!