నేడు, రేపు ఏపీ బడ్జెట్ సమావేశాలు: అసెంబ్లీ, మండలిలో టీడీపీ వ్యూహం ఇదీ...

By Sree s  |  First Published Jun 16, 2020, 12:13 AM IST

బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయమై ప్రతిపక్ష టీడీపీ సమాలోచనలు చేసినట్టు సమాచారం. తొలుత ఈ సమావేశాలను బహిష్కరించాలా, వద్దా అని తర్జనభర్జన పడ్డ పార్టీ నేతలు సమావేశాలకు హాజరు కావాలని, నల్ల చొక్కాలేసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలని స్కెచ్ గీసినట్టు తెలియవస్తుంది. 


కరోనా వైరస్ ప్రాత్యేక పరిస్థితుల మధ్య నేటి నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవనున్న విషయం తెలిసిందే. నేడు, రేపు రెండు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. నేడు గవర్నర్ ప్రసంగం తరువాత బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం అని తెలియవస్తుంది. తొలుత గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవనున్నాయి. 

ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయమై ప్రతిపక్ష టీడీపీ సమాలోచనలు చేసినట్టు సమాచారం. తొలుత ఈ సమావేశాలను బహిష్కరించాలా, వద్దా అని తర్జనభర్జన పడ్డ పార్టీ నేతలు సమావేశాలకు హాజరు కావాలని, నల్ల చొక్కాలేసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలని స్కెచ్ గీసినట్టు తెలియవస్తుంది. 

Latest Videos

undefined

రాష్ట్రంలోని అవినీతి, ఇసుక మాఫియా, ఎల్జీ పాలిమర్స్ ఘటన, అక్రమ అరెస్టుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని సమాలోచనలు చేసింది ప్రతిపక్ష టీడీపీ. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానాన్ని ఇందుకు వేదిక చేసుకోవాలని టీడీపీ యోచన చేస్తుంది. ఇక అంతే కాకుండా గవర్నర్ ని కలిసి వినతిపత్రం కూడా అందించాలని అనుకుంటున్నారు. 

ఇకపోతే నేడు టీడీపీ నేతలతో అసెంబ్లీ సమావేశాలహాజరుపై నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో.... రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. నల్లచొక్కాలతో అసెంబ్లీకి హాజరు కావాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. టీడీపీ నేతలపై ప్రభుత్వం  అక్రమ కేసులు పెడుతుందని సమావేశంలో కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.

దీంతో ఈ సమావేశాలకు హాజరుకాకూడదని కొందరు నేతలు సమావేశంలో సూచించారు. అయితే అసెంబ్లీకి వెళ్లకపోతే మండలిలో ప్రభుత్వం మరికొన్ని బిల్లులను ఆమోదించుకొనే అవకాశం ఉందని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. 

అవసరమైతే పరిస్థితిని బట్టి వాకౌట్ చేసి రావాలని మరికొందరు నేతలు కూడ సమావేశంలో సూచించారు. అసెంబ్లీ జరిగిన అన్ని రోజుల పాటు నల్లచొక్కాలతో వెళ్లాలని టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాజ్ భవన్ నుండి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలను ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, మండలిలో ఎమ్మెల్సీలోనే గవర్నర్ ప్రసంగం వీక్షిస్తారు. 

విపక్షం ఇలా అధికార పక్షానికి అడ్డుపడాలని యోచిస్తున్న తరుణంలో అధికార వైసీపీ అనుకుంటున్నంత వేగంగా సమావేశాలు ముందుకు సాగుతాయి అనేది వేచిచూడాల్సి అంశం. 

click me!