ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవనున్న విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ తో ఎప్పుడూ లేని విధంగా వినూత్నంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్ ప్రతిపాదనలకు ఈ భేటీలో కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.
ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవనున్న విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ తో ఎప్పుడూ లేని విధంగా వినూత్నంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్ ప్రతిపాదనలకు ఈ భేటీలో కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.
ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. దేశ చరిత్రలో మొదటిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగాన్ని వినిపించనున్నారు గవర్నర్.
గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదా వేస్తారు. వాయిదా తర్వాత బిఎసి సమావేశం అవనుంది. బీఏసీ ముగిసిన తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, చర్చ జరగనున్నాయి. ఆ తర్వాత సభలో బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సుమారు 2లక్షల 30 వేల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు ఉండబోనున్నాయి.
undefined
17వ తేదీ ఉదయం 9 గంటలకు రెండవ రోజు సభ ప్రారంభమవనుంది. సాధారణ బడ్జెట్‌పై పరిమిత స్థాయిలో చర్చ, ఆ చర్చకు మంత్రి సమాధానాలు ఇస్తారు. ఆ తరువాత బడ్జెట్‌కు ఆమోదం అనంతరం సభ వాయిదా.
18 వ తేదీ - అసెంబ్లీ / మండలి సమావేశాలు ఉండవు. రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్లు మాత్రమే ఉంటాయి 19 వ తేదీ నాడు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ, లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉండనుంది.గెలిచిన సభ్యుల స్పందనలకు కూడా అవకాశం ఇవ్వనున్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలోకి మంత్రులు,ఎమ్యెల్యే, ఎమ్మెల్సీల గన్ మెన్లకు,పీఎస్ లకు అనుమతిని నిరాకరించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి ఆందోళనలు,ప్లకార్డులు ప్రదర్శనకు కూడా అనుమతి లేదు.
అసెంబ్లీ మీడియా పాయింట్ సైతం మూసివేశారు. కేవలం 20 మంది రిపోర్టర్లు కు మాత్రమే అసెంబ్లీ గ్యాలరీ లోకి అనుమతించనున్నారు. సందర్శకులకు ఎలాంటి అనుమతి లేదు.
శాసన సభలో సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో సాధారణ బడ్జెట్‌ను డిప్యూటి సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టనున్నట్టుగా తెలియవస్తుంది.
ఈసారి బడ్జెట్లో కూడా ఏపీ సర్కార్ మరోసారి సంక్షేమ పథకాలకే పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తుంది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ని ప్రవేశపెట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసారి కూడా రైతాంగానికి, వ్యవసాయానికి అధికప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. గతేడాది 2,27,975 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టగా ఈసారి అంతకన్నా ఎక్కువ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్టు కనబడుతోంది.