సీఎం స్వంత జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీకి భారీ కేటాయింపులు

By narsimha lodeFirst Published Jul 12, 2019, 3:42 PM IST
Highlights

ముఖ్యమంత్రి స్వంత జిల్లా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏపీ సర్కార్ రూ. 250 కోట్లు కేటాయించింది.
 

అమరావతి: ముఖ్యమంత్రి స్వంత జిల్లా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏపీ సర్కార్ రూ. 250 కోట్లు కేటాయించింది.

శుక్రవారం నాడే ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డియ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం  రూ. 250 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు.  

ఏపీ పునర్విభజన చట్టంలో కూడ కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ గత ఐదేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం ముందుకు పడలేదు.దీంతో గత సీఎం చంద్రబాబునాయుడు ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ లోపుగా ఎన్నికలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చింది.వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేశారు.

ఈ ఏడాది డిసెంబర్ 26వ తేదీన కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని జగన్  హామీ ఇచ్చారు. ఈ  ఫ్యాక్టరీని మూడేళ్లలో పూర్తి చేస్తామని ఈ నెల 8వ తేదీన జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా జగన్ ప్రకటించారు. 

  మూడు ఏళ్లలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని జగన్ హామీ ఇచ్చారు.ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తైతే  20 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కేటాయించారు. 

సంబంధిత వార్తలు

వ్యవసాయ బడ్జెట్: మత్స్యపరిశ్రమకు అత్యధిక ప్రోత్సాహం

ప్రకృతి విపత్తులకు బడ్జెట్‌లో రూ.2002 కోట్లు: ఏపీ ప్రభుత్వం

ఐదేళ్లలో 25 లక్షల మందికి ఇళ్లు: బుగ్గన

బుగ్గన బడ్జెట్: మధ్యతరగతికి ఊరట

బుగ్గన బడ్జెట్‌: రైతాంగానికి పెద్దపీట

ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తాం: బుగ్గన

click me!