విశాఖ స్టీల్ ప్లాంట్: నేడు అమిత్ షాతో భేటీ కానున్న ఏపీ బీజేపీ నేతలు

By narsimha lode  |  First Published Feb 17, 2021, 10:18 AM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీకి చెందిన బీజేపీ ప్రతినిధి బృందం బుధవారంనాడు సమావేశం కానున్నారు.



న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీకి చెందిన బీజేపీ ప్రతినిధి బృందం బుధవారంనాడు సమావేశం కానున్నారు.

రెండు రోజుల క్రితం ఏపీకి చెందిన బీజేపీ నేతల బృందం న్యూఢిల్లీకి చేరుకొంది. ఇప్పటికే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి  విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజల సెంటిమెంట్ ను మంత్రికి వివరించారు.

Latest Videos

undefined

మరో వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకించకుండా ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని కూడ బీజేపీ నేతలు కేంద్ర మంత్రిని కోరారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను  మంగళవారం నాడు బీజేపీ ప్రతినిధి బృందం కలిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై నడ్డాతో చర్చించారు. అమిత్ షాతో చర్చించాలని నడ్డా సూచించారు. అమిత్ షాను కలిసిన తర్వాతే ఏపీకి తిరిగి వెళ్లాలని  నడ్డా బీజేపీ నేతలకు సూచించారు.

దీంతో బీజేపీ నేతలు అమిత్ షా  అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు.  ఇవాళ మధ్యాహ్నం ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారు. అమిత్ షా తో భేటీలో విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ గురించి బీజేపీ నేతలు వివరించనున్నారు.
 

click me!