కేసీఆర్ బర్త్ డే : వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న ఏపీ వాసులు..

Published : Feb 17, 2021, 09:48 AM IST
కేసీఆర్ బర్త్ డే : వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న ఏపీ వాసులు..

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా, కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా, కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కెసిఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  

తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కెసిఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొంది తాము ఈ విధంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపామని వారు తెలిపారు. 

తెలంగాణేతర ప్రజలు ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం పలువురిని ఆకర్షించింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?