మంత్రి అఖిలప్రియను భర్తరప్ చేయాలి: గవర్నర్‌కు బిజెపి నేతల ఫిర్యాదు

First Published Jun 7, 2018, 12:09 PM IST
Highlights

టిడిపి నేతలపై కన్నా హట్ కామెంట్స్


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చోటు చేసుకొంటున్న పరిణామాలపై ఏపీ బిజెపి నేతలు రాష్ట్ర గవర్నర్ నరసింహాన్‌కు గురువారం నాడు ఫిర్యాదు చేశారు.
ఏపీ రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ నవనిర్మాణ దీక్షలో ఇటీవల ప్రధానమంత్రి మోడీపై అనుచిత వ్యాఖ్లు చేశారని 
బిజెపి నేతలు మంత్రిపై ఫిర్యాదు చేశారు.మంత్రి వర్గం నుండి అఖిలప్రియను తప్పించాలని వారు డిమాండ్ చేశారు.


ఏపీ ప్లానింగ్ డిప్యూటీ ఛైర్మెన్ కుటుంబరావు తీరుపై కూడ వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.నవ నిర్మాణ దీక్షల సందర్భంగా ఏపీ సీఎంతో పాటు కొందరు మంత్రులు, టిడిపి నేతలు ప్రధానమంత్రి మోడీతో పాటు, ఇతర బిజెపి నేతలపై విమర్శలు గుప్పించడంపై బిజెపి నేతలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.
ఏపీలో ప్రభుత్వ పాలన కుంటుపడిందని ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.సంస్కార హీనమైన భాషను కొందరుటిడిపి నేతలు, మంత్రులు ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు.

అలిపిరి వద్ద బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై కూడ టిడిపి నేతలు దాడికి పాల్పడిన ఘటనపై కూడ చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
ఏపీ ప్లానింగ్ డిప్యూటీ ఛైర్మెన్  కుటుంబరావు పై కన్నా తీవ్రంగా మండిపడ్డారు. పశువులు కూడ కుటుంబరావు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కొందరు పోలీసులు టిడిపి నేతలుగా ప్రవర్తిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.పోలీసుల అండను చూసుకొని టిడిపి నేతలు రెచ్చిపోతున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారు.పోలీసు వ్యవస్థ అరాచకానికి దిగుతోందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.

click me!