జగన్ పాదయాత్రలో తేనెటీగల దాడి

Published : Jun 07, 2018, 10:44 AM IST
జగన్ పాదయాత్రలో తేనెటీగల దాడి

సారాంశం

పరుగులు తీసిన కార్యకర్తలు

జగన్ పాదయాత్రలో అనుకోని సంఘటన జరిగింది.   ఈ ఘటన కారణంగా.. కార్యకర్తలు పాదయాత్ర నుంచి పరుగులు తీశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లికోట కొండాలమ్మ గుడి వద్ద జగన్ 183రోజు పాదయాత్రను ప్రారంభించారు. 

ఈ క్రమంలోఓ ఆకతాయి అక్కడే ఉన్న తేనెతుట్టెను రాయితో కొట్టడంతో తేనెటీగలు దాడికి దిగాయి. దీంతో పాదాయత్రకు వచ్చిన కార్యకర్తలు పరుగులు పెట్టారు. ఈ ఘటనతో అప్రమత్తమైన జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. కొద్ది సేపటి తర్వాత.. తిరిగి  పాదయాత్రను కొనసాగించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్