ముదురుతోన్న అనిల్ యాదవ్ ‘‘అయ్యప్ప దీక్ష’’ వివాదం... క్షమాపణలకు సోము వీర్రాజు డిమాండ్

Siva Kodati |  
Published : Nov 25, 2022, 08:11 PM ISTUpdated : Nov 25, 2022, 08:12 PM IST
ముదురుతోన్న అనిల్ యాదవ్ ‘‘అయ్యప్ప దీక్ష’’ వివాదం... క్షమాపణలకు సోము వీర్రాజు డిమాండ్

సారాంశం

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయ్యప్ప దీక్షలో వుండి ముస్లిం టోపీ, కండువా ధరించడం వివాదాస్పదమైంది. దీనిపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయ్యప్ప దీక్షలో వుండి ముస్లిం టోపీ, కండువా ధరించిన మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌పై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం దీనిపై స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ సమాజం పట్ల అనిల్ కుమార్ యాదవ్ తీరు సరికాదన్నారు. హిందూ సమాజానికి అనిల్ కుమార్ యాదవ్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులతో కలిసి .. ముస్లిం టోపీ పెట్టుకుని అనిల్ పాదయాత్ర ఎలా చేస్తారని వీర్రాజు మండిపడ్డారు. అలాగే నెల్లూరులో రాళ్ల దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను తక్షణం అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

అటు నెల్లూరులోని అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయ్యప్ప దీక్షలో వుండి ఇతర మతస్థుల ప్రార్థనా మందిరానికి వెళ్లడంపై వారు అభ్యంతరం చెబుతున్నారు. హిందువుల మనోభావాలను ఎమ్మెల్యే కించపరిచారని, వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అనిల్ ఇంటికి చేరుకుని బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

ALso REad:అయ్యప్ప దీక్షలో ముస్లిం టోపీ పెట్టిన అనిల్ యాదవ్.. ఇంత బరితెగింపా : జీవీఎల్, విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం

కాగా.. నెల్లూరు నగరంలోని ఖుద్దూస్ నగర్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ ఇంటింటికి తిరిగారు. అయితే ఈ ప్రాంతంలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా వుండటంతో వారి మతాచారాలకు అనుగుణంగా ముస్లిం టోపీ, కండువా ధరించారు. దీనికి సంబంధించి ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్వామి అయ్యప్ప దీక్షలో ముస్లింల టోపీ, కండువా వేసుకుని భక్తుల్ని అవమానించారని వారు మండిపడ్డారు. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యేను శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని వారు పిలుపునిచ్చారు. అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు అనిల్ కుమార్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఓట్ల కోసం ఇంత బరితెగించాల్సిన అవసరం లేదని వారు చురకలంటించారు. 

 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?