అయ్యప్ప దీక్షలో ముస్లిం టోపీ పెట్టిన అనిల్ యాదవ్.. ఇంత బరితెగింపా : జీవీఎల్, విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం

Siva Kodati |  
Published : Nov 25, 2022, 04:02 PM ISTUpdated : Nov 25, 2022, 04:03 PM IST
అయ్యప్ప దీక్షలో ముస్లిం టోపీ పెట్టిన అనిల్ యాదవ్.. ఇంత బరితెగింపా : జీవీఎల్, విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం

సారాంశం

అయ్యప్ప దీక్షలో వుండి ముస్లిం టోపీ, కండువా ధరించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. అయ్యప్ప దీక్షలో వుండి ముస్లిం టోపీ, కండువా ధరించడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలోని ఖుద్దూస్ నగర్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ ఇంటింటికి తిరిగారు. అయితే ఈ ప్రాంతంలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా వుండటంతో వారి మతాచారాలకు అనుగుణంగా ముస్లిం టోపీ, కండువా ధరించారు. దీనికి సంబంధించి ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్వామి అయ్యప్ప దీక్షలో ముస్లింల టోపీ, కండువా వేసుకుని భక్తుల్ని అవమానించారని వారు మండిపడ్డారు. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యేను శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని వారు పిలుపునిచ్చారు. అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు అనిల్ కుమార్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఓట్ల కోసం ఇంత బరితెగించాల్సిన అవసరం లేదని వారు చురకలంటించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!